Amazon Prime Day 2022 : జూలై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day 2022 sale) జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Amazon Prime Day 2022 : జూలై 23 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

Amazon Prime Day 2022 Sale To Begin On July 23 Top Deals And Other Details Revealed (1)

Amazon Prime Day 2022 : ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day 2022 sale) జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అమెజాన్ కొన్ని స్మార్ట్‌ఫోన్ల డీల్స్ అందిస్తోంది. అనేక డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ICICI బ్యాంక్ కార్డ్‌లు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు తమ ప్రొడక్టులపై రూ. 20వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ పొందవచ్చు. వచ్చే వారంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా కొన్ని ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

జూలై 23న డీల్‌లు, ఆఫర్లు ఇవే :
OnePlus 9 సిరీస్ 5Gపై రూ. 15వేల వరకు తగ్గింపును అందించనున్నట్టు అమెజాన్ పేర్కొంది. అడిషినల్ ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లతో రూ. 37,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ ప్రస్తుతం Amazonలో అదే ధరకు అందుబాటులో ఉంది. లిమిటెడ్ కాల ఆఫర్. భారత మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో OnePlus 10 Pro 5G, కూపన్‌లపై రూ. 4వేల వరకు, ఎక్స్ఛేంజ్‌లో రూ. 7,000 వరకు అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. OnePlus 10R స్మార్ట్ ఫోన్ ధర రూ. 34,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ లవర్స్ తమకు ఇష్టమైన డివైజ్‌ను తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

Amazon Prime Day 2022 Sale To Begin On July 23 Top Deals And Other Details Revealed

Amazon Prime Day 2022 Sale To Begin On July 23 Top Deals And Other Details Revealed

iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Pro Maxపై రూ. 20వేల వరకు తగ్గింపును Amazon అందిస్తుంది. రెడ్‌మి నోట్ 10 సిరీస్ ప్రారంభ ధర రూ.10,999తో అందుబాటులో ఉంటుంది. Redmi Note 10T 5G, Redmi Note 10 Pro, Redmi Note 10 Pro Max, Redmi Note 10S వంటి ఇతర డివైజ్‌లను కూడా డిస్కౌంట్ ధరలకు అందించనుంది.

Xiaomi 11 Lite ప్రారంభ ధర 23,999 వద్ద అందుబాటులో ఉంది. Xiaomi 11T ప్రో యూజర్లకు రూ. 35,999గా ఉంది. Xiaomi 12 ప్రో కూడా ధర రూ. 56,999కి డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. 12 ప్రోపై రూ.6,000 తగ్గింపు ఆఫర్ కూడా అందిస్తోంది. Samsung Galaxy S21 FE 30 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. Galaxy M52 5G ధరపై రూ. 15వేల తగ్గింపు కూడా అందిస్తోంది. Amazon Samsung Galaxy M53 5G, Samsung Galaxy M33 5Gపై రూ. 8వేల వరకు తగ్గింపును అందిస్తుంది.

యూజర్లు Samsung M32పై రూ. 5వేల తగ్గింపును అందిస్తోంది. iQOO Neo 6 5G అసలు ధర (రూ. 29,999) ఉంటే.. అయితే రూ. 3,000 అదనపు ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ అందిస్తోంది. అదేవిధంగా, iQOO Z6 Pro, iQOO Z6 5G కూడా డిస్కౌంట్ పొందుతాయి. Realme ఫోన్‌లు కూడా రూ. 6వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్‌డే సేల్ డేట్ ఫిక్స్.. కొత్త స్మార్ట్ ఫోన్లపై అదిరే డీల్స్.. ఏయే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉండొచ్చుంటే?