Green India Challenge : మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్..

పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు..

10TV Telugu News

Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. గతకొద్ది కాలంగా ఈ మహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలురాయిని సాధించింది.

పద్మవిభూషణ్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఆయనతో పాటు కింగ్ నాగార్జున కూడా మొక్కలు నాటారు. జోగినిపల్లి, అమితాబ్‌కు ఈ కార్యక్రమం గురించి వివరించారు. గ్లోబల్ వార్మింగ్ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు పచ్చదనాన్ని పెంచాలని, ప్రజలు, తన అభిమానులు తప్పకుండా మొక్కలు నాటాలని అమితాబ్ అన్నారు.

భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను బిగ్ బి ప్రశంసించారు. రామోజీ ఫిలిం సిటీలో జరిగిన కార్యక్రమంలో అమితాబ్‌తో పాటు నాగార్జున, నిర్మాత అశ్వినీదత్, ఫిలిం సిటీ ఎం.డి విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న సై ఫై ఫిలింలో అమితాబ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన షూటింగ్ నిమిత్తం ఆయన ఆర్‌ఎఫ్‌సీలో ఉన్నారు.

×