Jhund : నిర్మాతల కోసం పారితోషికం తగ్గించుకున్న అమితాబ్..

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ ప్రస్తుతం ‘జుండ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఫుట్ బాల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో అమితాబ్ ఫుట్‌బాల్‌ కోచ్‌గా...........

Jhund : నిర్మాతల కోసం పారితోషికం తగ్గించుకున్న అమితాబ్..

Jhund

 

Amithab Bachchan :  బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ ప్రస్తుతం ‘జుండ్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఫుట్ బాల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. ఇందులో అమితాబ్ ఫుట్‌బాల్‌ కోచ్‌గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలయింది. ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ‘జుండ్’ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమాని భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు. అయితే సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు నిర్మాతలకి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సినిమాని పూర్తి చేస్తారో లేదో అని కూడా అనుకున్నారు అంతా. ఈ విషయం అమితాబ్ దృష్టికి వెళ్లడంతో అమితాబ్‌ నిర్మాతలకి సపోర్ట్ గా నిలిచారు. నిర్మాతలతో తన పారితోషికాన్ని తగ్గించుకోమని అమితాబ్ చెప్పారు.

Shahrukh Khan : లేట్ అయింది.. కానీ డేట్ గుర్తు పెట్టుకోండి.. ఎట్టకేలకు రాబోతున్న ‘పఠాన్’

ఈ విషయాన్ని స్యయంగా నిర్మాత సందీప్‌ సింగ్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపారు. సందీప్ సింగ్ మాట్లాడుతూ.. ”అమితాబ్ గారికి మా ఇబ్బందులు తెలియడంతో నాపై ఖర్చు చేసే బదులు దానిని సినిమా నిర్మాణంపై, సినిమా ప్రమోషన్స్ పై ఖర్చుపెట్టండి అని అమితాబ్ మాతో అన్నారు. బిగ్‌బి తన పారితోషికాన్ని తగ్గించుకోవడంతో మరి కొంతమంది నటీనటులు, టెక్నిషియన్స్ కూడా తమ పారితోషికాల్లో కొంతమేరకు తగ్గించుకున్నారు” అని తెలిపారు. దీంతో అమితాబ్ చేసిన పనికి నిర్మాతలతో పాటు అభిమానులు, నెటిజన్లు అమితాబ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.