Omicron Kit : ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్‌

ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విధానాన్ని వినియోగిస్తుండగా ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది.

Omicron Kit : ఒమిక్రాన్‌ను గుర్తించే కిట్‌

Kit

RT-PCR kit identify the Omicron : ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే ఆర్టీ-పీసీఆర్‌ కిట్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఒమిష్యూర్‌ పేరిట టాటా మెడికల్‌, డయాగ్నస్టిక్స్‌ రూపొందించిన ఈ కిట్‌కు ICMR ఆమోదం తెలిపింది. టాటా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్ ఎండీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కిట్ ఒమిక్రాన్‌తోపాటు ఇతర వేరియంట్లనూ గుర్తిస్తుందని తెలిపారు.

శాంపిల్స్‌ సేకరణ, ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కలుపుకొని.. ఈ కిట్‌ 130 నిమిషాల్లో ఫలితం వెల్లడిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ విధానాన్ని వినియోగిస్తుండగా.. ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఈ కిట్‌ ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.

India : భారత్‌‌పై కరోనా పంజా..58 వేల 097 కేసులు

భారత్ లో ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి. మొన్న ఒక్కరోజే దేశంలో 192 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, తమిళనాడు, కేరళలో ఉన్నాయి.

దేశంలో కరోనా మరోసారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా తగ్గుముఖం పడుతుందని అనుకుంటుండగా.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గత 24 గంటల్లో 58 వేల 097 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి 534 మంది చనిపోయారని తెలిపింది. ఓ వైపు కరోనా..మరోవైపు ఒమిక్రాన్ పంజా విసురుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోనలకు గురవుతున్నారు.