Anand Mahindra: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో..

Anand Mahindra: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra

Updated On : May 8, 2022 / 8:02 PM IST

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా చేసిన పనికి సోషల్ మీడియా మరోసారి ఫిదా అయింది. తమిళనాడు ఇడ్లీ అమ్మ సొంతింటి కల నిజంచేశారు మహీంద్రా. ఏప్రిల్ 2021లో ట్వీట్ చేసిన ఆయన.. త్వరలోనే ఇడ్లీ అమ్మ తనసొంతింటిలో వంట చేసి మరింతమందికి హోం కుక్‌డ్ అందించనుందని పేర్కొన్నారు.

 

“#మదర్స్ డే రోజున ఇడ్లీ అమ్మకు కానుకగా అందించడానికి ఇంటి నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసినందుకు మా బృందానికి చాలా కృతజ్ఞతలు. ఆమెకు & ఆమె చేసే పనికి  మద్దతివ్వడం ఒక ప్రత్యేకత. మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు!”

 

కమలాతల్ గా పిలిచే ఇడ్లీ అమ్మ.. తమిళనాడులోని పెరు గ్రామంలో ఉంటున్నారు.37ఏళ్లుగా ఇడ్లీ, చట్నీ, శాంబార్‌ను కేవలం రూ.1కే అందిస్తున్నారు.2019లో ఈమె స్టోరీ బాగా వైరల్ గా మారింది. ఆమె వ్యాపారానికి తాను పెట్టుబడి పెట్టడం మరింత సంతోషంగా ఉందని అన్నారు మహీంద్రా.

Read Also: ఆ విషయం చెప్తే.. నా జాబ్ పోతుంది – ఆనంద్ మహీంద్రా