off-road vehicles of 5 popular Indians: అంబానీ నుండి అఖిల్ వరకు.. సెలబ్రిటీల అడ్వెంచర్ కార్లు!

off-road vehicles of 5 popular Indians: అంబానీ నుండి అఖిల్ వరకు.. సెలబ్రిటీల అడ్వెంచర్ కార్లు!

Untitled

off-road vehicles of 5 popular Indians: రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువేముందు అన్న సామెతగా మన సెలబ్రిటీలు తలచుకుంటే వెనక్కు తగ్గేదేముంది. ఒకప్పుడు సినీ హీరోలంటే మంచి కారు కొనుక్కొనే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆన్ రోడ్ ఒకటి.. ఆఫ్ రోడ్ ఒకటి.. కేర్ వ్యాన్ ఒకటి.. టూర్ వ్యాన్ మరొకటి అన్నట్లుగా డజన్ల కొద్దీ కార్లు కొనేసి గ్యారేజీలను నింపేసుకుంటున్నారు. సినీ, బిజినెస్ సెలబ్రిటీలకు ఇప్పుడు కొత్త కొత్త కార్లు కొనడం అనేది సరదాగా మారిపోయింది. అందుకోసం కోట్లు ధారపోసి దక్కించుకుంటున్నారు. బెంజ్ నుండి లంబోర్ఘిని వరకు విలాసవంతమైన కార్లన్నీ ఇప్పుడు మన దేశంలో మన సెలబ్రిటీల వద్దే ఉన్నాయి. ఇవన్నీ ఆన్ రోడ్ వాహనాలు కాగా వారిలో కొందరు ఆఫ్ రోడ్ వాహనాలు కూడా కలిగి ఉన్నారు.

ఆఫ్ రోడ్ వాహనాలంటే కొండలు, కోనలు ఎక్కుతూ అడ్వెంచర్ డ్రైవింగ్ కోసం వాడే వాహనాలన్నమాట. కఠినమైన రహదారుల్లో ప్రయాణం కోసం వాడే ఈ వాహనాలంటే మన సెలబ్రిటీలతో కొందరికి అమితమైన ఇష్టం. వారిలో అంబానీ కిడ్ అనంత్ నుండి మన అక్కినేని కిడ్ అఖిల్ వరకు ఈ వాహనాలు కలిగి ఉన్నారు. క్రికెటర్ ధోనీ నుండి బాలీవుడ్ జాన్ రణబీర్ కపూర్ వరకు ఎవరికి నచ్చిన అడ్వెంచర్ బండిలో వారు హల్చల్ చేస్తున్నారు. ఇండియన్ సెలబ్రిటీలలో ఐదుగురి వద్ద ఉన్న ఈ ఆఫ్ రోడ్ వాహనాల గురించి తెలుసుకుందాం.

1. రణబీర్ కపూర్ – మెర్సిడెస్ జి 63 ఎఎమ్‌జి

off-road vehicles of popular Indians

off-road vehicles of popular Indians

బాలీవుడ్ హీరోలలో అడ్వెంచర్ రైడ్స్ చేయడంలో రణబీర్ కపూర్ ముందుంటాడు. అందుకే జర్మన్ కు చెందిన శక్తివంతమైన ఎస్‌యూవీని రణబీర్ కొనుగోలు చేశాడు. ఈ కారు 5.5-లీటర్ వి 8 పెట్రోల్ ఇంజిన్‌తో నడిచేది కాగా ఇది 563 బిహెచ్‌పి గరిష్ట శక్తిని, 760 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఇస్తుంది. ఇది 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇంజన్ కాగా ఏఎంజీ రైడ్ కంట్రోల్ స్పోర్ట్స్ సస్పెన్షన్, స్లైడింగ్ సన్‌రూఫ్ తో ఉంది. ఈ కారు కేవలం 5.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వరకు స్ప్రింట్ చేయగలిగే సామర్ధ్యం కాగా గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దీని ధర రూ.2.14 కోట్లుగా ఉంది.

2. జాన్ అబ్రహం – మారుతి జిప్సీ

off-road vehicles of popular Indians

off-road vehicles of popular Indians

ముంబైలో సముద్రం వ్యూ కనిపించేలా విలాసవంతమైన పెంట్ హౌస్ నుండి లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్స్ కలెక్ట్ చేయడం వరకు జాన్ అబ్రహం కు పేరుంది. అయితే, ఈ హీరోకు చిన్నప్పటి నుంచీ మారుతి జిప్సీ అంటే చాలా ఇష్టమట. అతని గ్యారేజీలో ఆడి క్యూ 7, నిస్సాన్ జిటి-ఆర్, లంబోర్ఘిని గల్లార్డో వంటి సూపర్ కార్స్ ఉన్నా జాన్ మాత్రం మారుతీ జిప్సీని అడ్వెంచర్ రైడ్స్ కోసం వాడుతుంటాడు. దీని ధర రూ.6.50 లక్షలు మాత్రమే.

3. ఎంఎస్ ధోని – హమ్మర్ హెచ్ 2, మహీంద్రా స్కార్పియో

off-road vehicles of popular Indians

off-road vehicles of popular Indians

కెప్టెన్ కూల్ గా పేరున్న ఎంఎస్ ధోని అడ్వెంచర్స్ చేయడంలో ఏ మాత్రం కూల్ కాదు. అందుకే కేవలం ఇలాంటి రైడ్స్ కోసమే రెండు వాహనాలు కలిగి ఉన్నారు. తన దగ్గర ఉన్న ఎడిషన్ హమ్మర్ హెచ్ 2 కారు 6.2-లీటర్ వి 8 పెట్రోల్ తో 393 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే ఇంజిన్ కాగా మరొక నాలుగు సీట్ల కారైన మహీంద్రా స్కార్పియోను అడ్వెంచర్ మోడల్ గా ప్రత్యేకంగా తయారుచేయించుకోవడం విశేషం. ఇది ఎరుపు ఇంటీరియర్‌లతో ఓపెన్ రూఫ్‌ను కలిగి ఉండగా ఈ కారుకు ఎలాంటి కంపెనీ లోగో ఉండదు. కానీ బదులుగా ‘ఎంఎస్’ అనే అక్షరాలతో కటోమైజ్డ్ చిహ్నం ఉంటుంది. ధోనీ వద్ద ఉండే హమ్మర్ హెచ్ 2 ధర రూ.75 లక్షలు.

4. అఖిల్ అక్కినేని – మెర్సిడెస్ జి-వాగెన్

off-road vehicles of popular Indians

off-road vehicles of popular Indians

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కుమారుడిగానే కాకుండా యంగ్ హీరోగా ఎదుగుతున్న అఖిల్ అక్కినేనికి కార్లపై ఇష్టం మించి పిచ్చిగా చెప్పుకోవచ్చు. అందుకే అక్కినేని గ్యారేజీలో బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ 7, ఆడి ఎ7, బిఎమ్‌డబ్ల్యూ ఎం6 వంటి కార్లు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్ జి-వాగెన్ ను ఈ అక్కినేని వారసుడు అడ్వెంచర్ రైడ్స్ కోసం వాడతాడు. ఇదీ 5 సీట్ల ఎస్‌యూవీ కాగా ఇందులో 1 డీజిల్ ఇంజన్, 1 పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. డీజిల్ ఇంజన్ 2925 సిసి కాగా పెట్రోల్ ఇంజన్ 3982 సిసి. ఈ కారు 8.13 కిలోమీటర్ల మైలేజీతో గరిష్ట శక్తిని 576 బిహెచ్‌పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీని ధర రూ.1.91 – 2.42 కోట్లు.

5. అనంత్ అంబానీ – మెర్సిడెస్ జి 63 ఎఎమ్‌జి

Off Road Vehicles Of Popular Indians

Off Road Vehicles Of Popular Indians

అంబానీ అంటే ఆ రేంజ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కాగా ముఖేష్ అంబానీ ఇప్పటికే మసెరటి లెవాంటే, బెంట్లీ బెంటెగా వంటి విదేశీ కార్లను కలిగి ఉండగా అతని కుమారుడు అనంత్ అంబానీ మెర్సిడెస్ జి 63 ఎఎమ్‌జిని కలిగి ఉన్న కొద్దిమంది భారతీయులలో ఒకరు. ఇది సాహసోపేత ప్రయాణాలలో అద్భుతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుందని పేరు. ఈ కారులో అధునాతన 7-స్పీడ్, జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, పెద్ద విండ్‌స్క్రీన్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి. 5.5-లీటర్ బిటుర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చిన ఈ కారు గరిష్ట శక్తి 544 బిహెచ్‌పి, 760 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. దీని ధర రూ.2.42 కోట్లుగా తెలుస్తుంది.