IPL 2026 : ఐపీఎల్‌ 2026.. సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్‌ సహా పది జట్ల పూర్తి వివరాలు.. ఆయా జట్లలోని సీనియర్ ప్లేయర్లు వీరే..

IPL 2026 : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ప్లేయర్లను ఆయా జట్టు కొనుగోలు చేశాయి.

IPL 2026 : ఐపీఎల్‌ 2026.. సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్‌ సహా పది జట్ల పూర్తి వివరాలు.. ఆయా జట్లలోని సీనియర్ ప్లేయర్లు వీరే..

Updated On : December 16, 2025 / 11:41 PM IST

IPL 2026 : ఐపీఎల్ -2026 మినీవేలం ప్రక్రియ ముగిసింది. అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.215.45 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 77 మంది ప్లేయర్లను ఆయా జట్టు కొనుగోలు చేశాయి. ఇందులో విదేశీ ప్లేయర్లు 29 మంది ఉన్నారు. వేలం ప్రక్రియ ముగియడంతో సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్, ముబై ఇండియన్స్ జట్లు సహా మొత్తం పది జట్లకు సంబంధించిన ప్లేయర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Also Read: IPL 2026 Auction : విధ్వంసకర బ్యాటర్‌ను కళ్లు చెదిరే ధరకు కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇక దబిడిదిబిడే.. కానీ..

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్: అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ, ముకేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, సంజు శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.
కార్తీక్ శర్మ (రూ. 14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), అకీల్ హోసేన్ (రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), అమన్ ఖాన్ (రూ.40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.2 కోట్లు), జాక్ ఫౌల్క్స్ (రూ.75 లక్షలు).

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పూర్తి జట్టు ఇదే..
రిటెన్షన్స్: అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, ఆకాశ్‌ సింగ్, అర్జున్ టెందూల్కర్ (ట్రేడ్), అర్షిన్ కులకర్ణి, అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రీట్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ (ట్రేడ్), మిచెల్ మార్ష్‌, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషభ్‌ పంత్, షాబాజ్‌ అహ్మద్.
ముకుల్ చౌదరి (రూ.2.6 కోట్లు), వానిందు హసరంగా (రూ.2 కోట్లు), అన్రిచ్ నోకియా (రూ.2 కోట్లు), నమన్ తివారీ (రూ.కోటి), అక్షత్ రఘువంశీ (రూ.2.2 కోట్లు), జోష్ ఇంగ్లిస్ (రూ.8.6 కోట్లు).

కోల్‌కతా నైట్‌రైడర్స్ పూర్తి జట్టు ఇదే..
రిటెన్షన్స్: అజింక్య రహానె, అంగ్‌క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
కామెరూన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), ఫిన్ అలెన్ (రూ. 2 కోట్లు), తేజస్వి సింగ్ (రూ. 3 కోట్లు), మతీశ పతిరన (రూ.18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మన్ (రూ. 9.2 కోట్లు), టిమ్ సీఫెర్ట్ (రూ. 1.5 కోట్లు), ప్రశాంత్ సోలంకి (రూ. 30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 30 లక్షలు), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), సార్థక్ రంజన్ (రూ. 30 లక్షలు), దక్ష్ కమ్రా (రూ. 30 లక్షలు), రచిన్ రవీంద్ర (రూ. 2 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ. 1 కోటి).

దిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు ఇదే..
రిటెన్షన్స్: అభిషేక్ పోరెల్, అజయ్ మండల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంత చమీర, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, నితీష్ రాణా (ట్రేడ్), సమీర్ రిజ్వీ, టి. నటరాజన్, త్రిపురణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్.
బెన్ డకెట్ (రూ.2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ.2 కోట్లు), అకిబ్ నబీ (రూ.8.4 కోట్లు), పాథుమ్ నిశాంక (రూ.5 కోట్లు), లుంగి ఎంగిడి (రూ.2 కోట్లు), పృథ్వీ షా (రూ.75 లక్షలు), సాహిల్ పరేఖ్ (రూ.30 లక్షలు), కైల్ జేమిసన్ (రూ.2 కోట్లు).

ముంబయి ఇండియన్స్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్: అల్లా ఘజన్‌ఫర్, అశ్వనీ కుమార్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే (ట్రేడ్), మిచెల్ శాంట్నర్, నమన్ ధీర్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రాబిన్ మింజ్, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్‌టన్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్.
క్వింటన్ డికాక్ (రూ.కోటి), డానిష్‌ మలేవార్ (రూ.30 లక్షలు), మహ్మద్ ఇజార్ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (రూ. 30 లక్షలు), మయాంక్ రావత్ (రూ. 30 లక్షలు).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు ఇదే .. 
రిటెన్షన్స్: అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, జాకబ్ బెతెల్, జితేశ్‌ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్య, నువాన్ తుషార, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, రసిఖ్ దార్ సలామ్ , రొమారియో షెఫర్డ్, సుయాశ్‌ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లీ, యశ్‌ దయాళ్.
వెంకటేశ్‌ అయ్యర్ (రూ.7 కోట్లు), జాకబ్ డఫీ (రూ.2 కోట్లు),సాత్విక్ దేస్వాల్ (రూ.30 లక్షలు), మంగేశ్ యాదవ్ (రూ.5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ.75 లక్షలు), విక్కీ ఓస్త్వాల్ (రూ.30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ.30 లక్షలు), కాన్షిక్ చౌహాన్ (రూ.30 లక్షలు).

రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్‌లు: ధ్రువ్ జురెల్, డొనావన్‌ ఫెరీరా (ట్రేడ్), జోఫ్రా ఆర్చర్, క్వేనా మఫాకా, లువాన్ డ్రే ప్రిటోరియస్, నాంద్రీ బర్గర్, రవీంద్ర జడేజా (ట్రేడ్), రియాన్ పరాగ్, సామ్ కరన్ (ట్రేడ్), సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్‌మయర్, శుభమ్ దూబె, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్విర్ చరక్.
రవి బిష్ణోయ్ (రూ.7.4 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), సుశాంత్ మిశ్రా (రూ.90 లక్షలు), విఘ్నేష్ పుతుర్ (రూ.30 లక్షలు), యశ్ రాజ్ పుంజా (రూ.30 లక్షలు), రవి సింగ్ (రూ. 95 లక్షలు), అమన్ రావు (రూ.30 లక్షలు), బ్రిజేష్ శర్మ (రూ.30 లక్షలు), కుల్‌దీప్ సేన్ (రూ.75 లక్షలు).

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్: అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జయ్‌దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరన్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జిషన్ అన్సారీ.
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.13 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ. 3 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.5 కోట్లు),  శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), ప్రఫులే హింగే (రూ.30 లక్షలు), క్రెయిన్స్ (రూ.30 లక్షలు), శివమ్ మావి (రూ.75 లక్షలు).

పంజాబ్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్: అర్ష్‌దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, మార్కో యాన్సెన్, మార్కస్ స్టాయినిస్, మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వధేరా, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సుర్యాంశ్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాక్ విజయ్‌కుమార్, జేవియర్ బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్.
కూపర్ కునెలి (రూ.3 కోట్లు), బెన్ డ్వార్షుయిస్ (రూ.4.4 కోట్లు),ప్రవీణ్ దూబె (రూ.30 లక్షలు).

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు ఇదే ..
రిటెన్షన్స్: అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గుర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కగిసో రబాడ, కుమార్ కుశాగ్రా, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్.
జేసన్ హోల్డర్ (రూ.7 కోట్లు), అశోక్ శర్మ (రూ.90 లక్షలు),టామ్ బాంటన్ (రూ.2 కోట్లు), పృథ్వీరాజ్ యర్రా (రూ.30 లక్షలు), ల్యూక్ వుడ్ (రూ.75 లక్షలు).