నాగ్ సినిమాలో అనిఖా సురేంద్రన్!

నాగ్ సినిమాలో అనిఖా సురేంద్రన్!

Anikha: బిగ్ బాస్ సీజన్ 4 తో పాటు ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కూడా కంప్లీట్ చేసిన కింగ్ నాగార్జున కొత్త సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ సినిమాతో పాటు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు నాగ్.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ స్లిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది.

Anikha

ఇదిలా ఉంటే ఈ మూవీలో అనిఖా సురేంద్రన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అనికా ఎవరంటే.. తమిళ స్టార్ హీరో ‘తల’ అజిత్ ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ చిత్రాల్లో ఆయన కూతురు పాత్రలో నటించి మెప్పించింది. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘గ్రేట్ ఫాదర్’ మూవీలోనూ కూతురి క్యారెక్టర్‌లో అలరించింది. అలాగే పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనిఖా.

Anikha

నాగ్, ప్రవీణ్ సత్తారు సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అనిఖా సురేంద్రన్‌ను సెలెక్ట్ చేశారని సమాచారం. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ చిత్రం బాలీవుడ్‌లోని ఓ చిత్రానికి రీమేక్ అనే వార్తలు బాగా వినిపించాయి. కానీ ఇప్పుడు నిర్మాతలు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రవీణ్ సత్తారే అని ప్రకటించడంతో.. ఓ ఫ్రెష్ స్క్రిప్ట్‌తోనే ఈ చిత్రం తెరకెక్కనుందనేది కన్ఫమ్ అయిపోయింది.

Anikha