Anil Ravipudi with Balakrishna: అనిల్ రావిపూడి కల నెరవేరుతున్నట్లే!

నందమూరి హీరో బాలకృష్ణతో సినిమా చేయాలన్నది దర్శకుడు అనిల్ రావిపూడి కల. ఈ మాట దర్శకుడే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. నిజానికి బాలయ్య సినిమాతోనే దర్శకుడిగా మారాలని అనిల్ అనుకున్నాడట.

Anil Ravipudi with Balakrishna: అనిల్ రావిపూడి కల నెరవేరుతున్నట్లే!

Anil Ravipudi With Balakrishna Anil Ravipudis Dream Seems To Be Coming True

Updated On : April 21, 2021 / 2:22 PM IST

Anil Ravipudi with Balakrishna: నందమూరి హీరో బాలకృష్ణతో సినిమా చేయాలన్నది దర్శకుడు అనిల్ రావిపూడి కల. ఈ మాట దర్శకుడే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పాడు. నిజానికి బాలయ్య సినిమాతోనే దర్శకుడిగా మారాలని అనిల్ అనుకున్నాడట. కానీ అనుకోకుండా కళ్యాణ్ రామ్ పటాస్ తో దర్శకుడిగా మారి సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్-3 సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తర్వాత మహేష్ తో సినిమాకు ప్లాన్ చేసుకున్నాడు. కానీ అనుకోని విధంగా మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కమిట్ అవడంతో అనిల్ మరోసారి బాలయ్య దగ్గరకు వెళ్లినట్లుగా తెలుస్తుంది.

బాలకృష్ణతో సినిమా చేయాలని అనిల్ చాలారోజులుగా వెయిట్ చేస్తున్నాడు. ఆ మధ్య కథ కూడా వినిపించిన అనిల్ రామారావుగారు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా చెప్పారు. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఆ తర్వాత బాలయ్య వారసుడు మోక్షజ్ఞను అనిల్ రావిపూడి పరిచయం చేయనున్నాడని ప్రచారం జరిగింది. అది కూడా మరుగునపడింది. అయితే.. ఇప్పుడు మరోసారి బాలయ్యతో కథా చర్చలు నడుస్తున్నాయని.. దాదాపుగా బాలయ్య అనిల్ స్టోరీ లైన్ కు ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం బాలయ్య బోయపాటితో అఖండ సినిమా చేస్తున్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు. ఈలోగా అనిల్ ఎఫ్-3 పూర్తిచేసుకొని బాలయ్య కథను సిద్ధం చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే ఎట్టకేలకు దర్శకుడు అనిల్ రావిపూడి కల నెరవేరినట్లే అవుతుంది. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా హైఓల్టేజ్ కథకు ఎంటర్ టైన్మెంట్ జోడించి తెరకెక్కించే అనిల్ తో సినిమా అనగానే అభిమానులలో కూడా అంచనాలు మొదలవుతున్నాయి.

Read: Rashmika Mandanna: షాకింగ్.. వాళ్ళ వ్యాపారం కోసం ఏకంగా హీరోయిన్ కు గుండు కొట్టేశారు!