Anushka on Prabhas: ప్రభాస్ బర్త్ డే.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క..!

ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా.. స్వీటీ అనుష్క ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. తన మనసులోని మాటను.. ట్వీట్ రూపంలో షేర్ చేసింది.

Anushka on Prabhas: ప్రభాస్ బర్త్ డే.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క..!

Anushka

Updated On : October 23, 2021 / 2:07 PM IST

బర్త్ డే సందర్భంగా.. డార్లింగ్ ప్రభాస్ పై శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. అతనితో హిట్ పెయిర్ గా గుర్తింపు ఉన్న బిల్లా బ్యూటీ స్వీటీ అనుష్క.. ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. ప్రభాస్ పై తన మనసులో ఉన్న ఆప్యాయతను ట్వీట్ రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంది.

జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయంలో ప్రభాస్ బెస్ట్ గా ఉండాలని స్వీటీ కోరుకుంది. అతని సినిమాలు విజయవంతం కావాలని.. అందరి హృదయాలను ప్రభాస్ గెలుచుకోవాలని ఆకాంక్షించింది. ఈ ట్వీట్ నిజంగా స్పెషల్.. అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అనుష్కకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతున్నారు.

ప్రభాస్, అనుష్క జోడీ.. ఆన్ స్క్రీన్ లో హిట్ పెయిర్. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. రూమర్లను పట్టించుకోకుండా.. స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్లలో ప్రభాస్, అనుష్క ముందుంటారని పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి.. బిల్లా, మిర్చి, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి కన్ క్లూజన్ సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Read More:

Radhe shyam Teaser : నాకు అన్ని తెలుసు.. కానీ నేను దేవుడ్ని కాదు.. విడుదలయిన రాధేశ్యామ్ టీజర్

Radhe Shyam : 30 నిమిషాల పాటు భారీ షిప్‌లో..