Adipurush : ‘ఆదిపురుష్’ కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. అందుకు గ్రీన్ సిగ్న‌ల్‌..

ప్ర‌భాస్(Prabhas) రాముడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా చిత్ర బృందానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది

Adipurush : ‘ఆదిపురుష్’ కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. అందుకు గ్రీన్ సిగ్న‌ల్‌..

Adipurush

Prabhas-Adipurush : ప్ర‌భాస్(Prabhas) రాముడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో తాజాగా చిత్ర బృందానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. టికెట్ రేటును పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. సింగిల్ స్క్రీన్‌, మ‌ల్టీఫ్లెక్సుల్లో టికెట్ ధ‌ర పై రూ.50 పెంచుకునేలా వెసులుబాటు క‌ల్పించింది.

Shah Rukh Khan: ప‌బ్లిక్‌గా మ‌హిళా అభిమాని చేసిన ప‌నికి షాకైన షారుఖ్ ఖాన్‌.. ఏం చేసిందో తెలుసా..?

సినిమా విడుద‌ల నాటి నుంచి 10 రోజుల పాటు పెరిగిన ధ‌ర‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి. అయితే..స్పెష‌ల్ షోల‌కు మాత్రం అనుమ‌తి నిరాక‌రించింది. ఇక ఇప్ప‌టికే మ‌రో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ‌లో మూడు రోజులు సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయల పెంచుకొనెల వెసులుబాటు క‌ల్పించింది. అలాగే ఆరో షోకు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా క‌నిపించ‌నున్న ఈ సినిమాను దాదాపు రూ.600 కోట్ల భారీ బ‌డ్డెట్‌తో తెర‌కెక్కించారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన టి సిరీస్, రెట్రోఫైల్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ చిత్ర‌ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు విక్ర‌యించారు. సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక సినిమాని అనాథ‌లు, పేద‌ల‌కు ఉచితంగా చూపించేందుకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌చ్చారు.

Adipurush : తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్లు పెంపు.. మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్..