Adipurush : తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్లు పెంపు.. మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్..

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మొదటి మూడు రోజులు ఈ సినిమా టికెట్ రేట్స్..

Adipurush : తెలంగాణలో ఆదిపురుష్ టికెట్ రేట్లు పెంపు.. మొదటి మూడు రోజులు టికెట్ రేట్స్..

telangana government sanctioned prabhas adipurush team to ticket price hike

Updated On : June 13, 2023 / 10:02 PM IST

Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా రామాయణ కథాంశంతో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ చిత్రంలో కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు అయిన టి సిరీస్, రెట్రోఫైల్స్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్మబడ్డాయి. ఇక ఆ పెట్టుబడిని రాబట్టుకోడానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను టికెట్ రేట్స్ పెంచుకునేలా వెసులుబాటు కోరింది.

Varun Tej – Lavanya Tripathi : పెళ్ళికి ముందు వరుణ్‌ తేజ్‌కి లావణ్య పెట్టిన కండిషన్.. అదేంటో తెలుసా?

ఇక దీని పై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా టికెట్ రేట్లు పెంచుకునేలా అవకాశం ఇచ్చింది. మొదటి మూడు రోజులు సింగల్ స్క్రీన్స్ లో 50 రూపాయల పెంచుకొనెల వెసులుబాటు కల్పించింది. అలాగే మొదటిరోజు స్పెషల్ షోకి అనుమతి ఇచ్చింది. ఉదయం 4 గంటలకి మొదటి షో పడనుంది. ఫస్ట్ డే మొత్తం 6 షోలు పడనున్నాయి. కేవలం 50 రూపాయిలు పెంచడంతో ప్రేక్షకులు కూడా పెంపు పై సానుకూలంగానే ఉన్నారు. కాగా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకుంది.

Prabhas : ప్రభాస్, మారుతి సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. రిలీజ్ డేట్!

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. శుగణాభిరాముడు కథ కావడంతో దేశంలో ఈ సినిమాని చూడలేని అనాధ పిల్లలకు, వృదులకు ఈ సినిమాని ఫ్రీగా చూపించేలా బాలీవుడ్ టు టాలీవుడ్ స్టార్స్ ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), అభిషేక్ అగర్వాల్, మంచు మనోజ్ దంపతులు తదితరులు ముందుకు వచ్చారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద రామరావణ యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలి.