Apple Watch : సముద్రంలో పడిన ఆపిల్ వాచ్.. నెల రోజులు నీళ్లలోనే.. కొంచెం కూడా వాచ్ చెక్కు చెదరలేదు.. ఎలా దొరికిందంటే?

Apple Watch : సాధారణంగా నీళ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా గాడ్జెట్ పడితే దాదాపు అది పనిచేయదు. కానీ, కొన్ని స్మార్ట్‌వాచ్‌లు వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. దాంతో నీళ్లలో పడినా ఆయా వాచ్‌లు బాగానే పనిచేస్తాయి.

Apple Watch : సముద్రంలో పడిన ఆపిల్ వాచ్.. నెల రోజులు నీళ్లలోనే.. కొంచెం కూడా వాచ్ చెక్కు చెదరలేదు.. ఎలా దొరికిందంటే?

Apple Watch _ Man loses Apple Watch in sea, finds it days later in working condition

Apple Watch : సాధారణంగా నీళ్లలో ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా గాడ్జెట్ పడితే దాదాపు అది పనిచేయదు. కానీ, కొన్ని స్మార్ట్‌వాచ్‌లు వాటర్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. దాంతో నీళ్లలో పడినా ఆయా వాచ్‌లు బాగానే పనిచేస్తాయి. అందులో ఆపిల్ వాచ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుత రోజుల్లో చాలా స్మార్ట్‌వాచ్‌లు (Smartwatches) నీటికి నిరోధకతను కలిగి ఉన్నాయి. వాచీలు స్ప్లాష్‌లను తట్టుకునేలా ఉంటాయి. నీటి అడుగున 30 నిమిషాల పాటు కూడా పనిచేయగలవని చాలా కంపెనీలు పేర్కొన్నాయి.

కానీ, మీరు రియల్ టెస్టింగ్ చేసినప్పుడు చాలా గడియారాలు నీళ్లలో పడిన తర్వాత పనిచేయవు. అయితే, ఆపిల్ వాచ్ మాత్రం అలా కాదు.. ఈ వాచ్‌లో హెల్త్ ట్రాకింగ్ టూల్ (Health Tracking Tool) మాత్రమే కాదు, రోజుల తరబడి నీటిలో ఉన్నా కూడా పనిచేయగలదు. వాస్తవానికి ఇదే రుజువైంది కూడా. ఇటీవల బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరోలో సముద్రంలో ఒక వ్యక్తి తన ఆపిల్ వాచ్‌ను పోగొట్టుకున్నాడు. ఆసక్తికరంగా, అతడు ఫైండ్ మై యాప్‌ (Find My App)ని ఉపయోగించి వాచ్‌ని తిరిగి పొందాడు.

Read Also : Tech Tips in Telugu : పేటీఎం, పోన్‌పే వ్యాలెట్ నుంచి నగదును బ్యాంకు అకౌంట్లకు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ టిప్స్..!

బ్రెజిలియన్ వెబ్‌సైట్ R1 నివేదిక ప్రకారం.. రోచా బుజియోస్‌లో పర్యటనలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఆపిల్ వాచ్‌ని నీళ్లలో పొగొట్టుకున్నాడు. ఈత కొడుతుండగా చేతికి ధరించిన ఆపిల్ వాచ్ నీళ్లలో పడిపోయింది. రోచా వెంటనే తన ఆపిల్ వాచ్‌ని కనుగొనేందుకు ప్రయత్నించాడు, కానీ సాధ్యపడలేదు.

Apple Watch _ Man loses Apple Watch in sea, finds it days later in working condition

Apple Watch _ Man loses Apple Watch in sea, finds it days later in working condition

అతను తన గడియారాన్ని గుర్తించడానికి ఫైండ్ మై యాప్‌ని ఉపయోగించాడు. ఆసక్తికరంగా నీటి అడుగున ఉన్న తన ఆపిల్ వాచ్ గుర్తించాడు. ఎందుకంటే.. ఈ ఆపిల్ వాచ్‌లో GPS ఉంది. నీటి-నిరోధకత కలిగిన వాచ్ అని సంగతి అతడికి తెలియదు. వాచ్ పనిచేయదని భావించాడు. కానీ, రోచాకు ఫైండ్ మై యాప్ నుంచి వాచ్ ఆన్ అయిందని నోటిఫికేషన్ వచ్చింది.

రోచా లాస్ట్ మోడ్‌ను ఆన్ చేసి.. ఆపై సంబంధించిన కొంత డేటాను రిజిస్టర్ చేసింది. వెంటనే అతను ఆపిల్ వాచ్‌ను కనుగొన్నట్లు తెలిపాడు. ఆపిల్ వాచ్‌ను కనుగొన్న వ్యక్తి కుమార్తె మెసేజ్ చేసింది. బిజియోస్‌లో ఉన్నానని, తమకు వాచ్ దొరికిందని, ఆమె తండ్రి వాచ్ తిరిగి ఇవ్వాలని కోరిందని రోచా చెప్పారు. ఈ వాచ్ 50 ఏళ్ల డైవర్ కనుగొన్నాడు, అతను 16 ఏళ్ల అమ్మాయి తండ్రి.. అతను కోరల్ పార్క్‌ను చూసుకుంటాడు. అంతేకాదు.. పోగొట్టుకున్న వస్తువులను గుర్తించి యజమానులకు తిరిగి ఇస్తుంటాడు.

ఫిహో అనే డైవర్ ఆపిల్ వాచ్‌ను కనుగొన్నప్పుడు అది బాగానే పనిచేస్తుందని చెప్పాడు. అయితే, అతని కుమార్తెకు కూడా ఆపిల్ వాచ్ ఉంది. దాంతో అతడు ఆ డివైజ్ ఛార్జర్‌ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ఆపిల్ వాచ్ ఆన్ అయింది. వెంటనే ఫైండ్ మై యాప్ మెసేజ్ చూపించింది. నెల రోజుల పాటు సముద్రంలో ఉన్నా ఆపిల్ వాచ్ వర్కింగ్ కండిషన్‌లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చివరికి ఆపిల్ వాచ్‌ను రోచాకు తిరిగి ఇచ్చాడు.

Read Also : Moto G Stylus 5G : ట్రిపుల్ కెమెరాలతో మోటో G Stylus 5G ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!