Kidney Disease : స్త్రీలకు కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఎక్కువే?

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఆకలి లేకపోవటం, పాదాల వాపు, ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు కళ్ల చుట్టూ ఉబ్బినట్లు ఉంటే, వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.

Kidney Disease : స్త్రీలకు కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఎక్కువే?

Kidney

Kidney Disease : దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి భారత దేశంలో ఆందోళన కలిగిస్తున్న వ్యాధుల్లో ఒకటిగా ఉంది. జీవనశైలి మార్పులు, ఆహారం , వ్యాయామం లేకపోవడంతో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు దరిచేరుతున్నాయి. గతంలో ఈ సమస్య వృధ్దాప్యంలో ఉండే వారిలో మాత్రమే గమనించేవారు అయితే ప్రస్తుతం యువకులు సైతం కిడ్నీ వ్యాదుల బారిన పడుతున్నారు. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, ప్రపంచంలోని జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి బారిన పడినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీని కారణంగా చనిపోతున్నారు.  చికిత్స అందుబాటులో లేకపోవటమే దీని కారణం. డయాలసిస్ ,కిడ్నీ మార్పిడితో చికిత్స ఆర్థిక భారం కావటం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్త్రీలు మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కొరవడటం, ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేని పరిస్ధితిల్లో ఉన్నారు.

జీవనశైలిలో మార్పులు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి దారితీయవచ్చు. కుటుంబ చరిత్ర వల్ల సైతం ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు రక్తపోటు, స్ట్రోక్ ,కార్డియాక్ అరెస్ట్‌, వంటి గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి మహిళల్లో ఎక్కువగా ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నప్పటికీ, దీనికి ప్రధాన కారణం పరిమిత అవగాహన మరియు సరైన సంరక్షణ లేకపోవటమే. ముఖ్యంగా ఆర్ధికంగా వెనుకబడి ఉన్నదేశాలలో వ్యాధిని ఆలస్యంగా రోగనిర్ధారణ చేయటం, దీంతో తీవ్రమైన కిడ్నీ ఇనెప్ఫెక్షన్ల దశకు చేరుకుంటున్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో సైతం చాలా మంది మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారు. సరైన వైద్య సలహాలు తీసుకోకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో అది గర్భధారణ ప్రేరిత మైపర్ టెన్షన్, ప్రెగ్నేన్నీ టాక్సేమియాకు దారి తీస్తుంది.

కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఆకలి లేకపోవటం, పాదాల వాపు, ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు కళ్ల చుట్టూ ఉబ్బినట్లు ఉంటే, వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ముందస్తుగా గుర్తించడం, రోగ నిర్ధారణ చేయటం ద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే చివరికి అది కిడ్నీ వైఫల్యానికి, మరణానికి దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధిని వివిధ పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు. మొదటిది, అల్బుమిన్ ప్రోటీన్ యొక్క ఉనికిని తనిఖీ చేసే మూత్ర పరీక్ష, ఈ రకమైన ప్రోటీన్ చాలా ఎక్కువ కిడ్నీ దెబ్బతిన్న సంకేతాలను సూచిస్తుంది. రెండవ పద్ధతి వయస్సు, లింగం మరియు రక్త పరీక్షలను ఉపయోగించి క్రియేటినిన్ స్థాయిలను పరిశీలించటం ద్వారా కిడ్నీ పనితీరును, కిడ్నీకి కలిగే నష్టాన్ని అంచనా వేయవచ్చు.

కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని నివారించడానికి ఉత్తమ మార్గం మంచి జీవనశైలి అలవాట్లను కలిగిఉండటం. ఒక వ్యక్తికి అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర వంటి సమస్యలు కలిగి ఉండే దానిని నియంత్రించడానికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చురుకుగా ఉండటం ఆరోగ్యకరమైన మూత్రపిండాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, బరువును అదుపులో ఉంచుకోవాలి. రక్తంలో అదనపు గ్లూకోజ్ రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు అదనపు భారం పడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచటానికి ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఉప్పు తక్కువగా ఉండే ఇంట్లో వండిన తాజా పదార్థాలను తినటం మంచిది. రోజుకు 2 నుండి 3 లీటర్ల నీటిని తాగాలి. ధూమపానం , ఆల్కాహాల్ వంటి వాటిని మానుకోవటం మంచిది. నొప్పి నివారిణి మాత్రలను తీసుకోవద్దు. ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.