Summer : వేసవిలో ద్రవాహారానికే పరిమితమౌతున్నారా? అయితే జాగ్రత్త

శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంలో వేసవి కాలంలో ద్రవ రూపఆహారాలు అవసరమే అయినప్పటికీ ఘనాఆహారం కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి.

Summer : వేసవిలో ద్రవాహారానికే పరిమితమౌతున్నారా? అయితే జాగ్రత్త

Diet Summers

Summer : ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆరోగ్యంపై పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అధిక వేడి కారణంగా శరీరం వడదెబ్బ, డ్రీహైడ్రేషన్ లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవిలో ఆరోగ్యం కాపాడుకునేందుకు సాత్వికమైన ఆహారంతోపాటు, ద్రవాహారాలను తీసుకోవటం మంచిది. ఆరోగ్యం, అందం, బరువు తగ్గడం కోసం చాలా మంది వేసవిలో లిక్విడ్‌ డైట్‌లపై ఆధారపడుతున్నారు. ఎండాకాలంలో కేవలం ద్రవరూప ఆహారాలను తీసుకోవటం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే
ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. హెర్బల్‌ టీ, నిమ్మకాయ నీళ్లు, తేనె, పండ్లు, కూరగాయల రసాలు వంటి వాటిని తీసుకోవటం మంచిది. అయితే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవటం మంచిది. నిల్వ ఉండే ప్రొటీన్ షేక్స్ తీసుకోకపోవటమే ఉత్తమం. ఎందుకంటే వీటి వల్ల కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంపై చెడుప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు అలాంటి వాటిని దూరంగా పెట్టాలి. కేవలం ద్రవరూప ఆహారాలకే పరిమితమై చాలా మంది ఘన రూప ఆహారాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. శరీరం త్వరగా నీరశించి పోతుంది. వీటి పర్యవసనాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంలో వేసవి కాలంలో ద్రవ రూపఆహారాలు అవసరమే అయినప్పటికీ ఘనాఆహారం కూడా చాలా ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి. మనం ఆహారం తీసుకునే మూడు పూటల్లో ఒక పూట ద్రవ రూపంలో ఉండే ఆహారాలకు ప్రాధాన్యత నివ్వాలి. మిగిలిన రెండు పూటలు ఘన రూప ఆహారాలను తీసకోవటం మంచిది. మధ్యాహ్న సమయంలో ద్రవరూపంలో ఉండే వాటిని తీసుకోవటం వల్ల ఎండల వేడి నుండి శరీరం చల్లబడుతుంది. అయితే ఉదయం అల్పాహారం, రాత్రి సమయంలో మాత్రం ఘనా ఆహారాలను తీసుకోవటం వల్ల నీరసం , ఒత్తిడి, అలసట వంటివి దరి చేరకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టేందుకు ఘనాహారం తోడ్పడుతుంది.