Updated On - 7:51 pm, Wed, 24 February 21
Teddy Trailer: తమిళ యువనటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టెడ్డీ’. పెళ్లి తర్వాత ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్ నటస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా.. గ్రాఫిక్స్‌తో కూడిన సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ‘టెడ్డీ’ ట్రైలర్ రిలీజ్ చేశారు.. జయం రవితో ‘టిక్ టిక్ టిక్’ అనే స్పై చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న సౌందర్ రాజన్ ‘టెడ్డీ’ మూవీలో ఒక సామాజిక అంశానికి గ్రాఫిక్స్ జతచేసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారనిపిస్తోంది. కథలో టెడ్డీకి కూడా ప్రాధాన్యత కల్పించారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.
డైరెక్టర్ మగి తిరుమేని ఈ సినిమా ద్వారా విలన్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సతీష్, కరుణాకరన్, సాక్షి అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 12 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో ‘టెడ్డీ’ స్ట్రీమింగ్ కానుంది.. ఈ సినిమాకి సంగీతం : డి.ఇమాన్, కెమెరా : ఎస్.యువ, ఎడిటింగ్ : టి.శివానందీశ్వరన్.
Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..
Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్
Samantha Video: సమంతా ఒక్క వీడియోకు 20లక్షల లైకులా..