Ashes : విజృంభించిన బౌలర్లు.. 47 పరుగులు 6 వికెట్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్.. ఆసీస్‌కు ఆధిక్యం
బజ్‌బాల్ వ్యూహాం మరోసారి ఇంగ్లాండ్‌కు అచ్చిరానట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌటైంది.

Australia
Ashes ENG vs AUS : గతకొంతకాలంగా ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ వ్యూహాం అనుసరిస్తోంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. అయితే.. తొలి టెస్టులో ఈ వ్యూహాం బెడిసికొట్టడంతో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. ఒక్క టెస్టులో ఓటమి చెందినంత మాత్రన బజ్‌బాల్ వ్యూహాన్ని వదలిపెట్టం అని మిగిలిన మ్యాచుల్లో సైతం అలాగే ఆడతామని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు.
Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్పిన్నర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడడం కష్టమే..!
బజ్‌బాల్ వ్యూహాం మరోసారి ఇంగ్లాండ్‌కు అచ్చిరానట్లే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 325 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, హ్యారీ బ్రూక్ అర్థశతకంతో రాణించాడు. మిగిలిన వారిలో జాక్ క్రాలీ(48), ఓలి పోప్(42) ఫర్వాలేదనిపించగా, జో రూట్(10), బెన్ స్టోక్స్(17), బెయిర్ స్టో (16) లు విఫలం అయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్ వుడ్ చెరో రెండు వికెట్లు తీయగా, కమిన్స్, నాథన్ లైయన్, కామెరూన్ గ్రీన్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆసీస్ కు కీలకమైన 91 పరుగుల ఆధిక్యం లభించింది.
47 పరుగులు 6 వికెట్లు
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 278 పరుగులతో మూడో రోజు ఆటను ప్రారంభించింది ఇంగ్లాండ్. ఆసీస్ బౌలర్ల దాటికి మరో 47 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన కాసేపటికే ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు జోడించకుండానే బెన్ స్టోక్స్ ఔట్ కాగా.. ఐదు పరుగులు చేసి అర్థశతకం పూర్తికాగానే హ్యారీ బ్రూక్ సైతం పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ రెండు వికెట్లను మిచెల్ స్టార్క్ పడగొట్టాడు.
Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచరీ.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్
అయితే.. బెయిర్ స్టో, సువర్ట్ బ్రాడ్(12) లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. బెయిర్ స్టోను ఔట్ చేయడం ద్వారా వీరిద్దరి భాగస్వామ్యాన్ని హేజిల్‌వుడ్ విడదీశాడు. దీంతో 311 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది. ఆ తరువాత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు.