Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్పిన్న‌ర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడ‌డం క‌ష్ట‌మే..!

యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ సిన్న‌ర్ నాథ‌న్ లియోన్ ( Nathan Lyon) గాయ‌ప‌డ్డాడు.

Ashes : ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్పిన్న‌ర్ నాథన్ లైయన్‌కు గాయం.. ఆడ‌డం క‌ష్ట‌మే..!

Nathan Lyon

Updated On : July 1, 2023 / 11:45 AM IST

Ashes ENG vs AUS : యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ సిన్న‌ర్ నాథన్ లైయన్‌ ( Nathan Lyon) గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు మూడో రోజు ఆట‌కు దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌లో మిగిలిన మూడు టెస్టుల్లో అత‌డు ఆడ‌డం సాధ్యం కాకపోవ‌చ్చు. మ్యాచ్ ఉత్కంఠ భ‌రితంగా సాగుతున్న వేళ అత‌డు అందుబాటులో లేకుండా పోవ‌డం ఆస్ట్రేలియాకు ఇది గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

రెండో రోజు ఆట‌లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న నాథన్ లైయన్‌ బంతిని ఆపే క్ర‌మంలో గాయ‌ప‌డ్డాడు. కుడికాలికి గాయం కావ‌డంతో నొప్పితో విల‌విల‌లాడాడు. వెంట‌నే ఫిజియో వ‌చ్చి చికిత్స అందించాడు. అయితే.. గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్‌కు పంపారు. మ‌ళ్లీ అత‌డు తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్ట‌లేదు. క‌నీసం మూడో రోజు అయిన అత‌డు ఆడుతాడ‌ని అభిమానులు భావించారు. అయితే.. మూడో రోజు మ్యాచ్ ఆరంభానికి గంట‌న్న‌ర ముందు ఆస్ట్రేలియా జ‌ట్టు గ్రౌండ్‌కు చేరుకుంది. ఈ స‌మ‌యంలో నాథన్ లైయన్‌ రెండు స్టాండ్స్‌(crutches) సాయంతో న‌డుస్తుండ‌డం క‌నిపించింది.

Ashes : స్టీవ్ స్మిత్ రికార్డు సెంచ‌రీ.. రెండో టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్‌

పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేప‌థ్యంలో నాథన్ లైయన్‌ గాయంతో దూరం అవ్వ‌డం క‌మిన్స్ సేన‌కు ప్ర‌తికూల‌మే. రెండో టెస్టులో లైయన్‌ 13 ఓవ‌ర్లు వేసి ఓ వికెట్ తీశాడు. మ‌రో నాలుగు వికెట్లు తీస్తే టెస్టుల్లో ఐదు వందల‌ వికెట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్ట‌నున్నాడు. ఇక‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లైయన్‌ 4 వికెట్లు తీయ‌డ‌మే కాకుండా క‌మిన్స్‌తో క‌లిసి 9వ వికెట్‌కు 55 ప‌రుగులు జోడించి ఆసీస్ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించాడు.

రెండో రోజు మ్యాచ్ అనంత‌రం లైయన్‌ గాయంపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. “లైయన్‌ గాయం తీవ్ర‌త గురించి ఇంకా తెలియ‌దు. తీవ్ర‌మై అత‌డు దూరం అయితే మాత్రం క‌ష్ట‌మే. అత‌డు లేని లోటును తీర్చ‌లేం. ఎలా జ‌ర‌గాల‌ని ఉంటే అలా జ‌రుగుతుంది. “అని అన్నాడు.

Ashes : ప్రారంభ‌మైన యాషెస్ రెండో టెస్టు.. ఊహించ‌ని ప‌రిణామం.. ఆందోళ‌న కారుడిని ఎత్తి ప‌డేసిన బెయిర్ స్టో

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే రెండో టెస్టు మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. స్టీవ్ స్మిత్ (110) సెంచ‌రీ చేయ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 4 వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌(45), కెప్టెన్ బెన్ స్టోక్స్‌(17) క్రీజులో ఉన్నారు. ఓపెన‌ర్ బెన్ డ‌కౌట్ (98) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.