Ashwini Dutt : ముందు అలా.. తర్వాత ఇలా.. నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం..

అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారడంతో మళ్ళీ ఏమైందో తెలీదు కానీ మరోసారి దీనిపై మాట్లాడుతూ.. ''యాభై ఏళ్లుగా చిత్ర‌సీమ‌లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నాను. నా తోటి నిర్మాత‌లంద‌రితో................

Ashwini Dutt : ముందు అలా.. తర్వాత ఇలా.. నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం..

Ashwini Dutt

Ashwini Dutt :  టాలీవుడ్ సమస్యలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఉన్న సమస్యలు చాలవన్నట్టు ప్రొడ్యూసర్ గిల్డ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్ మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. టాలీవుడ్ సమస్యలపై పరిష్కారం దొరికే వరకు షూటింగ్స్ బంద్ అన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వ్యతిరేకిస్తున్నారు. సమస్యలకి వారు ప్రతిపాదించిన పరిష్కారాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ గిల్డ్ చేసిన ప్రతిపాదనలపై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. ”నిర్మాతల శ్రేయస్సు కోసమే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇప్పుడు ప్రొడ్యూసర్ గిల్డ్ ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. టికెట్ల రేట్లు పెంచమన్న వాళ్ళే ఇప్పుడు తగ్గించమని అంటున్నారు. టికెట్ ధరలు పెంచిన వాళ్లే ఇప్పుడు షూటింగ్స్ బంద్ అంటున్నారు. హీరోలకి ఇష్టం వచ్చినట్లు హీరోలకు పారితోషకాలు ఇస్తున్నారనడం సరికాదు. హీరోలు మార్కెట్ ధర ప్రకారం కరెక్ట్ గానే పారితోషకాలు తీసుకుంటున్నారు. గతంలో ఏదైనా సమస్యలుంటే ఫిల్మ్ చాంబరే పరిష్కరించేది. ఇప్పుడున్న నిర్మాతల్లో స్థిరత్వం లేదు” అని వ్యాఖ్యలు చేశారు. అయితే అశ్వినీదత్ వ్యాఖ్యలపై టాలీవుడ్ లో దుమారం రేగింది.

Bandla Ganesh : హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత మనకి లేదు..

అయితే అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారడంతో మళ్ళీ ఏమైందో తెలీదు కానీ మరోసారి దీనిపై మాట్లాడుతూ.. ”యాభై ఏళ్లుగా చిత్ర‌సీమ‌లో నిర్మాత‌గా కొన‌సాగుతున్నాను. నా తోటి నిర్మాత‌లంద‌రితో చాలా స‌న్నిహితంగా, సోద‌ర భావంగా మెలిగాను. నాకు ఏ నిర్మాత‌పైనా అగౌర‌వం లేదు. గిల్డ్ అయినా, కౌన్సిల్ అయినా నిర్మాత‌లు, చిత్ర‌సీమ శ్రేయ‌స్సు కోస‌మే ఉద్భ‌వించాయి. ప‌రిశ్ర‌మ కోసం అంద‌రూ ఒక్క తాటిపై న‌డిచి మంచి నిర్ణ‌యాలు తీసుకొంటే బాగుంటుంద‌ని నా అభిప్రాయం. నిర్మాత‌లంతా క‌లిసి చిత్ర‌సీమ గురించి ఏ మంచి నిర్ణ‌యం తీసుకొన్నా నా సంపూర్ణ‌ మ‌ద్ద‌తు ఉంటుంది” అని అన్నారు. దీంతో ముందు గిల్డ్ కి వ్యతిరేకంగా మాట్లాడి, తర్వాత సపోర్ట్ చేయడంతో ఏదో జరిగింది అని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.