Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ

ఈ సమయంలోనే ఆ ప్రజలకు కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు.

Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ

Ias Officer

Jalli Keerthi : కుక్క వాకింగ్ కోసం.. స్టేడియంను ఖాళీ చేయించి ఓ ఐఏఎస్ అధికారి విమర్శలు ఎదుర్కుంటుంటే… సామాన్య ప్రజల కష్టాలకు చలించిపోయి.. వాళ్ల సంక్షేమం కోసమే పాటు పడుతూ శభాష్‌ అనిపించుకుంటున్నారు తెలంగాణ అడబిడ్డ… అసోం కేడర్ అధికారి జల్లి కీర్తి. కష్టాల్లో ఉన్న అసోం ప్రజలకు సేవలందిస్తున్నారు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్నారు.

వరంగల్‌లో పుట్టి పెరిగిన కీర్తి జల్లి.. అసోంలోని కచార్‌ డిప్యూటీ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. వారం రోజులుగా అసోంలో కురుస్తున్న వర్షాలు, వరదలతో ర‌హ‌దారులు, రోడ్లు, భ‌వ‌నాలు.. ఇలా అన్నీ నాశ‌న‌మైపోయాయి. ప్రజలు సర్వం కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

Police Humanity: అర్ధరాత్రి సైకిల్‌పై డెలివరీ బాయ్‌ని చూసి పోలీసులు ఏం చేశారో తెలుసా!

ఈ సమయంలోనే ఆ ప్రజలకు కీర్తి జల్లి అండగా నిలిచారు. వరదలు, భారీ వర్షాలతో సర్వం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలకు ఆసరా అవుతున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండానే మోకాల్లోతు బురదలో నడుస్తూ ప్రజల ఇబ్బందులను తీర్చుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు.

కీర్తి జల్లి అక్కడి ప్రజలను అక్కున చేర్చుకోవడాన్ని చూసి యావత్‌ సోషల్‌ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి ఆమె అనుసరిస్తున్న విధానం చూసి తోటి ఐఏఎస్‌లు అభినందిస్తున్నారు. ఆమెకు వృత్తిపై ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న మమకారానికి అందరూ ఫిదా అవుతున్నారు.