Assam Govt : అప్పుడు జైలుకు వెళ్లిన వారికి నెలకు రూ.15వేలు పెన్షన్ : మంత్రి అశోక్ సింగల్

ఆ సమయంలో జైలుకెళ్లిన వారిని నెల నెలా రూ.15 వేలు పెన్షన్స్ ఇస్తామని అసోం ప్రభుత్వం ప్రకటించింది. అస్సాం పౌరులకు మాత్రమే ఈ పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు మంత్రి అశోక్ సింగల్..

Assam Govt : అప్పుడు జైలుకు వెళ్లిన వారికి నెలకు రూ.15వేలు పెన్షన్ : మంత్రి అశోక్ సింగల్

Emergency time assam govt

Assam Govt : ఎమర్జెన్సీ టైమ్ అంటే ఠక్కున గుర్తుకొస్తుంది దివంగత నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. అప్పటికి ఇప్పటికి భారత దేశానికి మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీయే. ఆమె ప్రభుత్వ హయంలో ఎన్నో సంచలనాలు. ఆమె మరణం కూడా అంతటి సంచలనమే కలిగింది. అంతటి చరిత్ర కలిగిన ఇందిర హయాంలో ఎమర్జన్సీ అనేది చాలా గుర్తుండిపోయే అంశంగా ఉంది. ఇందిరా పాలన గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇందిరా హయాంలో ఎమర్జన్సీ టైమ్ అనేది ఇప్పుడెందుకంటే అస్సాం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం గురించే..

ఎమర్జెన్సీ కాలంలో జైలుశిక్ష అనుభవించినవారికి అస్సాం ప్రభుత్వం పెన్షన్లు ఇస్తామని ప్రకటించింది. ఎమర్జన్సీ వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన వాళ్లను ఇందిర ప్రభుత్వం జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఎమర్జన్సీ కాలంలో జైలుకెళ్లిన వారిని నెల నెలా రూ.15 వేలు పెన్షన్స్ ఇస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన అసోం పౌరులకు మాత్రమే ఈ పెన్షన్ అందజేస్తామని ప్రకటించారు మంత్రి అశోక్ సింగల్..

1975 నుంచి 1977 వరకు ఎమర్జన్సీ కాలంగా ఉంది ఇందిర సర్కార్ హయంలో. 21 నెలల పాటు ఎమర్జన్సీ కొనసాగింది. ఈ సమయంలో మార్షల్ లా విధించబడింది. దేశ ప్రజల రాజ్యాంగ హక్కులు నిలిపివేయబడ్డాయి. ఆ సమయంలో ఎమర్జన్సీని వ్యతిరేకిస్తు ఎంతోమంది ఆందోళనలు చేపట్టారు దేశ వ్యాప్తంగా..దీంతో వారిని ఇందిర ప్రభుత్వం జైళ్లపాలు చేసింది. ఇందిర ప్రభుత్వ హయాంలో జరిగిన అంత్యంత వ్యతిరేకత కలిగించి అంశంగా చరిత్రలో నిలిచిపోయింది ఘటన..

కాగా..1975లో విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకించి అసోంలో 301 మంది జైలుపాలయ్యారని ప్రభుత్వం గుర్తించింది. వీరికి నెలనెలా పింఛను అందజేస్తామని బుధవారం (ఏప్రిల్ 2023) ప్రకటించారు మంత్రి అశోక్ సింగల్. వీరిలో ఇప్పటికే చాలామంది ప్రాణాలతో లేరు. కానీ ప్రాణాలతో ఉన్నవారికి నెలకు రూ.15వేలు అందజేస్తామని ఎవరైనా ప్రాణాలతో లేకుంటే వారి జీవిత భాగస్వామికి,ఇద్దరూ లేకుంటే వారి కూమార్తె (అవివాహిత) కు ఈ పెన్షన్ అందజేస్తామని తెలిపారు. అస్సాం కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వారు చేసిన కృషిని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ‘లోక్ తంత్ర సేని’ పేరుతో ఈ పెన్షన్లు అందజేస్తామని తెలిపారు.