బెడ్‌రూమ్‌లో భార్యాభర్తలు మీటరున్నర దూరంలో ఉండాలి : జంటలకు ప్రభుత్వం సూచన

బెడ్‌రూమ్‌లో భార్యాభర్తలు మీటరున్నర దూరంలో ఉండాలి : జంటలకు ప్రభుత్వం సూచన

Australia couples to stay 1.5 metres in bed room: భార్యాభర్తలు హాయిగా కలిసి కాపురం చేయండి అని పెద్దలు దీవిస్తుంటారు. కానీ ఓ దేశంలో ప్రభుత్వం మాత్రం భార్యాభర్తలు కలిసి ఉండొద్దని అంటే ముఖ్యంగా బెడ్ రూమ్ లో అసలు కలిస ఉండొద్దని సూచనలు చేసింది. అదేంటీ భార్యభర్తల మధ్య పానకంలో పుడకలా ఈ ప్రభుత్వం ఆంక్షలేంటీ..అసలు ఇటువంటి సూచనలేంటీ? అలా చెప్పటానికి ప్రభుత్వానికి హక్కు ఉందా? అనే ఆగ్రహం కలగొచ్చు..కానీ ఈ కరోనా కాలంలో అన్ని ఇటువంటి వింత వింత పోకడే కనిపిస్తున్నాయి.

ఈక్రమంలో ఆస్ట్రేలియా ఆరోగ్యం శాఖ అధికారులు ఆదేశంలోని జంటలకు పలు సూచనలు చేశాయి. ‘‘పడక గదిలో జంటలు 1.5 మీటర్ల దూరం పాటించాలని..మాస్కులు తప్పనిసరిగా ధరించాలని.. ఒకరినొకరు తాకకుండా సాధ్యమైనంత వరకూ ‘దాంపత్య సంబంధానికి’దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా ఆరోగ్య విభాగం సూచించడం సర్వత్రా చర్చనీయంగా మారింది. అధికారులు మాత్రం ‘ ‘COVID Safe Sex’ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. భార్యాభర్తలు లిప్ కిస్ పెట్టుకోవాలంటే కనీసం మూడు పొరలు ఉండే మాస్కులు ధరించాలని సూచించారు.

కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి కానీ పూర్తిగా తగ్గలేదనే విషయం తెలిసిందే. ఈక్రమంలో బయట వ్యక్తులతోనే కాదు..కుటుంబంలోనే సభ్యులతో కూడా జాగ్రత్తగానే ఉండాలని..ముఖ్యంగా భార్యాభర్తలు బెడ్ రూమ్ లో తగు జాగ్రత్తలు పాటించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరిస్తోంది. భార్యభర్తలు పడక గదిలో 1.5 మీటర్ల దూరం పాటించాలని సూచిస్తోంది. ఇప్పుడంతా ఈ విషయం గురించే చర్చిస్తున్నారు. ఇది తలతిక్క సూచన అని కొట్టిపారేస్తున్నారు.

కాగా..కరోనా వైరస్ ప్రపంచదేశాలను ఎంతగా గడగడలాడించేస్తోంది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. గత సంవత్సరం నుంచి అదే కొనసాగుతోంది. బయట అడుగు పెట్టాలంటే మాస్కన సమయం నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు ప్రతి నిమిషం, ప్రతీసెకను అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిందే.

ముఖానికి మాస్క్ పెట్టుకోవడమే కాకుండా..భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మహమ్మారి వైరస్ ఎప్పుడు.. ఏ విధంగా ఎలా దాడి చేస్తుందో కూడా తెలీకుండానే ప్రాణాల్ని హరించేస్తోంది. చాలామంది వైరస్ తగ్గిపోయిందని హాయిగా ఉండొచ్చని అనుకుంటున్నారు. కానీ వైరస్ కాస్త తగ్గినమాట నిజమే. కానీ శాశ్వతంగా నిర్మూలన కాలేదని మరచిపోవద్దు. ఇది పొంచి ఉన్న మహమ్మారి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే మరచిపోవద్దు.

చాపకింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. కొత్తగా కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. దీనికి కొత్తగా యూకే స్ట్రెయిన్ కూడా తోడైంది. ఈ క్రమంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండటమే కాకుండా ప్రభుత్వ నిబంధనలను కూడా కచ్చితంగా పాటించాలి. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం.. జంటలకు వెల్లడించిన కరోనా వైరస్ సూచనలు తెలుసుకుంటే ఆశ్చర్యపోకుండా ఉండలేం..కానీ అక్కడి పరిస్థితుల రీత్యా ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు ముఖ్యంగా జంటలకు బెడ్ రూమ్ లో తగిన దూరం పాటించాలని ప్రస్తుత పరిస్థితుల క్రమంలో ఇది పాటిస్తే మంచిదని సూచిస్తున్నారు.