Bangladesh vs Australia: బంగ్లాదేశ్‌ చేతిలో దారుణంగా సిరీస్ ఓడిన ఆస్ట్రేలియా

గతంలో ఎప్పుడూ లేనట్టుగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను దారుణంగా ముగించింది.

Bangladesh vs Australia: బంగ్లాదేశ్‌ చేతిలో దారుణంగా సిరీస్ ఓడిన ఆస్ట్రేలియా

Aus

Bangladesh vs Australia, 5th T20I- గతంలో ఎప్పుడూ లేనట్టుగా అనుభవం లేని ప్లేయర్లతో బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు సిరీస్‌ను దారుణంగా ముగించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌‌లు ఓడిపోయి స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమైంది ఆస్ట్రేలియా జట్టు. ఐదు మ్యాచ్‍‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కేవలం 62 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో (టి20, వన్డేలు) ఆ్రస్టేలియాకి ఇదే అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌ ముందువరకు కూడా 2005లో ఇంగ్లండ్‌పై చేసిన 79 పరుగులు అత్యల్ప స్కోరుగా ఉంది. ఈ మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై ఘనవిజయం సాధించిన బంగ్లాదేశ్‌.. సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది. క్రికెట్‌లో పిల్లి కూనగా భావించే బంగ్లాదేశ్ పెద్ద పులిలా అనుకునే ఆస్ట్రేలియాపై ఇటువంటి విజయం అంటే గొప్పనే చెప్పాలి.

టి20ల్లో ఆసీస్‌కు ఇది వరుసగా రెండో సిరీస్‌ ఓటమి. గత నెలలో విండీస్‌ చేతిలో ఆస్ట్రేలియా 1-4తో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌‌తో చివరి మ్యాచ్‌లో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగుల చేసింది. ఓపెనర్‌ మొహమ్మద్‌ నైమ్‌ (23 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఛేజింగ్‌లో ఆ్రస్టేలియా 13.4 ఓవర్లలో 62 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

షకీబుల్‌ హసన్‌ ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. 9పరుగులు ఇచ్చి 4వికెట్లు తీశారు. సైఫుద్దీన్‌ 12పరుగులు ఇచ్చి 3వికెట్లు తీశాడు. సిరీస్‌లో ఏడు వికెట్లతో పాటు 114 పరుగులు చేసిన షకీబ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు కూడా లభించింది. ఈ మ్యాచ్‌తో షకీబ్‌ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నారు.