5% GST on Auto : కొత్త ఏడాదిలో ప్రయాణం మరింత భారం..ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు

కొత్త సంవత్సరం రాకతో కొత్త భారాలు షురుకానున్నాయి. ఇకపై ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు తప్పేలా లేదు.

5% GST on Auto : కొత్త ఏడాదిలో ప్రయాణం మరింత భారం..ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు

5% Gst On Auto

5% GST on Auto Journey : మరికొన్ని గంట్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. సరికొత్త బాదుడ్ని కూడా తెచ్చేస్తోంది. 2020-21 ల్లో కరోనాతో పోరాటంతో అందరు బిక్కుబిక్కుమంటూ గడిపారు. 2021 మధ్యలోనే కరోనా కేసులు భారీగా తగ్గాయి అని సంతోషపడేలోపే డెల్టా అంటూ..ఒమిక్రాన్ అంటూ కొత్త వేరియంట్లు హడలెత్తిస్తున్నాయి. ఈ భయంలోనే 2022 సంవత్సరం వచ్చేస్తోంది. మరి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలనుకుంటున్నారా? అయితే సరికొత్తగా జీఎస్టీ బాదుడికి కూడా స్వాగతం పలకాల్సిందే. ఎందుకంటే జీఎస్టీ పేరుతో ఆటో చార్జీలు పెరగనున్నాయి. అంటే కొత్త ఏడాదిలో ఆటో చార్జీలు మరింత భారం కానున్నాయన్నమాట. ఆటో ఎక్కితే 5 % జీఎస్టీ బాదుడు తప్పదంటోంది ఈ కామర్స్. ఈ కామర్స్ ద్వారా బుక్ చేసుకున్న ఆటోలకు 5 % జీఎస్టీ వడ్డన తప్పదంటోంది.

Read more : Cristiano Ronaldo: యువతకు ప్రేరణగా ఉండాలని రొనాల్డ్ విగ్రహం

పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్య జనానికి మరో బాదుడు తప్పదనేలా ఉంది. కొత్త సంత్సరం నుంచి ఆటో చార్జీలు మరింత పెరగబోతున్నాయి. ఆటో ప్రయాణానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఓలా, ఉబర్ వంటి రైడ్ షేరింగ్ యాప్‌లలో ఆటో బుక్ చేసుకుంటే ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తుంది. ర్యాపిడో నుంచి బైక్ బుక్ చేసుకున్నా ఇదే వర్తిస్తుంది. బుక్ చేసుకునే సమయంలోనే జీఎస్టీ 5 శాతం కలిపేసి ధరను నిర్ణయింపబడుతుంది. కానీ ఆన్‌లైన్‌లో కాకుండా బయట ఆటోను బుక్ చేసుకుంటే ఈ జీఎస్టీ వర్తించదు. గుడ్డిలో మెల్లలాగా ఇదోరకం ఊరటం అనుకోవాలి.

Read more : Job Applicants MP : 15 ప్యూన్ ఉద్యోగాల కోసం11,000 దరఖాస్తులు..PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులతో సహా..

ప్రభుత్వ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 4 లక్షల మందిపై భారం పడనుంది. నగరంలో 38 వేల ఆటోలు ఓలా, ఉబర్ నుంచి బుకింగులు జరుగుతున్నాయి. ఒక్కో ఆటో రోజుకు 20 నుంచి 25 ట్రిప్పులు కలుపుకుంటే రోజూ 8 లక్షలకు పైగా రైడ్లు. ఈ లెక్కన చూసుకుంటే ప్రయాణికులపై నిత్యం లక్షల రూపాయల భారం పడుతుందన్నమాట. కారుతో పోలిస్తే ఆటో ధర తక్కువ కావడంతో మధ్యతరగతి ప్రజలు ఆటోలనే ఎక్కువగా బుక్ చేసుకుంటుంటారు. ఇప్పుడు ఆటో రైడ్‌పై జీఎస్టీ విధించడం వల్ల మధ్యతరగతిపై భారం తప్పేలా లేదు.