Phalana Ammayi Phalana Abbayi : డైరెక్టర్‌గా అవసరాల శ్రీనివాస్.. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఫస్ట్ లుక్ రిలీజ్..
'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదల చేశారు........

Avasarala Srinivas Directional Movie Phalana Ammayi Phalana Abbayi first look released
Phalana Ammayi Phalana Abbayi : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. నటుడు శ్రీనివాస్ అవసరాల మరోసారి డైరెక్టర్ గా మారి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గూఢచారి, ఓ బేబీ వంటి అనేక విజయాలను కలిగి ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది.
నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే రెండు గుర్తుండిపోయే క్లాసిక్ చిత్రాలను అందించారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ‘ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి’తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.
తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను నేడు విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్ లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.
నిన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్ అవసరాలతో కాల్ మాట్లాడిన హీరోహీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. “ఆర్ఆర్ఆర్ కూడా విడుదలైంది” అని శౌర్య అనగా.. “ఆర్ఆర్ఆర్ లో మూడే అక్షరాలు ఉన్నాయని, ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి(PAPA)లో నాలుగు అక్షరాలు ఉన్నాయి” అంటూ శ్రీనివాస్ అవసరాల సరదాగా బదులిచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ జనవరి 2న రాబోతుందని తెలిపారు.
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో ప్రదర్శించబోతున్నట్లు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెలిపారు. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు.
Samantha : ఫిబ్రవరిలో మరో సినిమాతో రాబోతున్న సమంత.. శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్..
గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, ‘ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి’కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.