Samantha : ఫిబ్రవరిలో మరో సినిమాతో రాబోతున్న సమంత.. శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్..

సమంత నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సమంత మెయిన్ లీడ్ లో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు................

Samantha : ఫిబ్రవరిలో మరో సినిమాతో రాబోతున్న సమంత.. శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్..

Samantha shakunthalam movie releasing date announced

Samantha :  సమంత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే యశోద సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది. సమంత మెయిన్ లీడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా యశోద సినిమా నవంబర్ 11న థియేటర్స్ లో రిలీజయింది. మంచి విజయం సాధించి దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా సమయంలోనే సమంతకి మాయోసైటిస్ అనే వ్యాధి సోకిందని, చికిత్స తీసుకుంటున్నాను అని తెలిపింది.

ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. అభిమానులు, ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సమంత త్వరగా కోలుకొని వరుస సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సమంత మెయిన్ లీడ్ లో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని శాకుంతలం పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

Bollywood : 2023లో అయినా బాలీవుడ్ కంబ్యాక్ ఇస్తుందా?? కొత్త సినిమాలతో 2023ని టార్గెట్ చేసిన బాలీవుడ్..

గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ నిర్మాణంలో శాకుంతలం సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో అల్లు అర్జున్ కూతురు ఆర్హ శకుంతల చిన్నప్పటి పాత్రని పోషిస్తూ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతుంది. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్. 2023 ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాని పాన్ ఇండియా సినిమాగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అలాగే ఈ సినిమాని 3D లో కూడా రిలీజ్ చేయనున్నారు. దీంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సినిమా చూడాలని, సమంతని మళ్ళీ తెరపై చూడాలని ఎదురు చూస్తున్నారు.