Avatar 2: హాలీవుడ్ కీ తప్పని లీకుల బెడద.. ఆన్​లైన్​లో ‘అవతార్​ 2’ ట్రైలర్​!

హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్‌'. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

Avatar 2: హాలీవుడ్ కీ తప్పని లీకుల బెడద.. ఆన్​లైన్​లో ‘అవతార్​ 2’ ట్రైలర్​!

Avatar2

Avatar 2: హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్‌’. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్‌ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాల ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచాయి.

Avatar 2: నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. వరల్డ్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ రిలీజ్!

ఎన్నో అద్భుతాలు ఉన్న అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ రానున్న సంగతి తెలిసిందే. డిసెంబ‌ర్ 16న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతున్న అవ‌తార్ 2 ఇదివ‌ర‌కెన్న‌డూ లేని వీఎఫ్ఎక్స్ తో ప్రేక్ష‌కులకు అద్బుత‌మైన అనుభూతిని క‌లిగించేలా ఉండ‌నుంద‌ట‌.

Avatar 2: సకుటుంబ సపరివార సమేతంగా రానున్న అవతార్-2

కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా డిసెంబర్ 16న ఏకంగా 160 భాషల్లో విడుదల కాబోతుందట. అదే జరిగితే ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదే రికార్డ్ కానుంది. అలాగే బుధవారం మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ని సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం చేశారు. అలాగే హాలీవుడ్ సినిమా డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ థియేటర్స్ లో కూడా మే 6న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అనుకోకుండా ఈ ట్రైలర్ గ్లిమ్ప్స్ లీకై సోషల్ మీడియాఓ ప్రత్యక్షమైనట్లు తెలుస్తుంది.

Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!

ఈ గ్లిమ్ప్స్ ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు కానీ.. ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్​ లింక్​లు సోషల్​ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఫుటేజ్​కు సంబంధించిన వీడియోను ట్విటర్ డిలీట్​ చేయడంతో ఇలా కనిపిస్తున్నట్లు చెప్తున్నారు. కాగా ఈ లీక్​కు సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. మరోవైపు ఇది ఒక ప్రమోషన్​ స్టంట్​ అని పలువురు నెటిజన్స్​ భావిస్తున్నారు.