Baby Goat: 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టిన మేకపిల్ల

ఈ మేక పిల్ల లోకల్ సెలబ్రిటీ అయిపోయిందని తెలుసా.. పాకిస్తాన్ కు చెందిన ఈ మేక ఏకంగా 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. జూన్ 5ను పుట్టిన ఈ మేక న్యూబియన్ బ్రీడ్ కు చెందినది. సాధారణంగానే ఈ జాతి మేకలకు పొడవైన చెవులుంటాయి.

Baby Goat: 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టిన మేకపిల్ల

Pakistan

Baby Goat: ఈ మేక పిల్ల లోకల్ సెలబ్రిటీ అయిపోయిందని తెలుసా.. పాకిస్తాన్ కు చెందిన ఈ మేక ఏకంగా 19 అంగుళాల పొడవైన చెవులతో పుట్టింది. జూన్ 5ను పుట్టిన ఈ మేక న్యూబియన్ బ్రీడ్ కు చెందినది. సాధారణంగానే ఈ జాతి మేకలకు పొడవైన చెవులుంటాయి. వీటితో వేడి వాతావరణంలోనూ చల్లగా ఉంచుకోగలుగుతాయి. దీని ప్రత్యేకమైన చెవులకు గానూ దానికి సింబా అని పేరు పెట్టుకున్నాడు యజమని.

సింబా చెవులు స్టాండర్డ్ సైజ్ కంటే ఎక్కువగా.. ఉండటంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నారట. తన మేక పిల్లను చూడగానే ఆశ్చర్యపోయానని 19అంగుళాల పొడవైన చెవులతో నేలపై ఈడ్చుకుంటూ వెళ్తుంటే గాలి వేస్తూ ఉంటుందని చెప్తున్నాడు దాని యజమాని మహమ్మద్ హస్సన్ నారెజో.

జెనెటిక్ డిజార్డర్ తోనే ఇలా జరుగుతుందని నిపుణులు అంటుంటే, ఓనర్ గిన్నీస్ వరల్డ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నాడు. ఇది పాకిస్తాన్ లో కనిపించే మోస్ట్ కామన్ బ్రీడ్. ప్రపంచంలోనే మేకలను ఉత్పత్తి చేసే దేశాల్లో మూడో స్థానంలో ఉంది పాకిస్తాన్.

Read Also : ఆడ మేకను పెళ్ళి చేసుకున్న ఇండోనేషియన్.. ఎందుకో తెలుసా…. ?

కొన్నింటిని కేవలం మాంసం కోసం పెంచితే, మరికొన్నింటిని కేవలం పాలు, మాంసం కోసం పెంచుతారు. న్యూబియన్ గోట్ అనే జాతి మేక పాలు హైక్వాలిటీతో కూడి ఉంటాయి. వీటిని పలు విభిన్నమైన పాల ఉత్పత్తుల్లో వాడతారు కూడా.