Viral Video : ఆడ మేకను పెళ్ళి చేసుకున్న ఇండోనేషియన్.. ఎందుకో తెలుసా…. ?

ఇండోనేషియాకు చెందిన యూ ట్యూబర్ కూడా ఇలానే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఒక ఆడమేకను పెళ్ళి చేసుకుని ఆ వీడియో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

Viral Video : ఆడ మేకను పెళ్ళి చేసుకున్న ఇండోనేషియన్.. ఎందుకో తెలుసా…. ?

goaty marriage

Viral Video :  సోషల్ మీడియా   ప్లాట్ ఫాంలు పెరిగిపోయాక   ప్రతి ఒక్కరూ ఎప్పూడూ ఏదో ఒక్క  కొత్తదనంతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారు. దీంతో ఒకోసారి వింత వింత పనులు చేసి వార్తల్లోకెక్కి రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతున్నారు.

ఇండోనేషియాకు చెందిన యూ ట్యూబర్ కూడా ఇలానే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని ఒక ఆడమేకను పెళ్ళి చేసుకుని ఆ వీడియో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. తూర్పు జావాలోని గ్రెసిక్ కు చెందిన సైఫుల్ ఆరిఫ్ అనే 44 ఏళ్ల యూ ట్యూబర్ జూన్ 5న గ్రేసిక్ లోని బెంజెంగ్ జిల్లాలోని కాంప్లోకో గ్రామంలో రహాయు బిన్ బెజో అనే పేరు గల ఆడ  మేకను వివాహం చేసుకున్నాడు.

ఈవివాహ తంతును వీడియో తీశాడు. ఈ వీడియోలో ఆరిఫ్ జావానీస్ దుస్తులు ధరించగా మేకను శాలువాతో అలంకరించారు. కొందరు స్థానికులు సంప్రదాయ దుస్తులు ధరించి వివాహ   వేడుకకు హాజ‌ర‌య్యారు. అత‌డు మేక‌కు రూ. 22,000 క‌ట్నం కూడా ఇచ్చాడు.

New Project (1)

అయితే, ఈ వీడియోపై నెటిజ‌న్లు ఆగ్రహావేశాలు వెలిబుచ్చారు. దీంతో సైఫుల్ అంద‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాల్సి వచ్చింది.  ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే   చేశానని, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యంతో చేయ‌లేద‌ని వివరణ ఇచ్చాడు.

Also Read : Income tax return: ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది: సీబీడీటీ