Income tax return: ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది: సీబీడీటీ

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం 7.14 ఐటీఆర్‌లు దాఖ‌లు కాగా, అంత‌కుముందు సంవ‌త్స‌రం ( (FY21) 6.9 కోట్లు దాఖ‌ల‌య్యాయి.

Income tax return:  ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగింది: సీబీడీటీ

Itr

Income tax return: గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం (FY22)కి గాను ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసిన వారి సంఖ్య అంత‌కుముందు ఏడాదితో పోల్చితే భారీగా పెరిగింద‌ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మ‌న్ సంగీతా సింగ్ తెలిపారు. ఆమె శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ… గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తం 7.14 ఐటీఆర్‌లు దాఖ‌లు కాగా, అంత‌కుముందు సంవ‌త్స‌రం ( (FY21) 6.9 కోట్లు దాఖ‌ల‌య్యాయ‌ని చెప్పారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

స‌వ‌రించిన రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య కూడా పెరిగింద‌ని తెలిపారు. దేశంలో ప‌న్ను వ‌సూళ్లు కూడా పెరిగాయ‌ని ఆమె చెప్పారు. ఇది ఆర్థిక వృద్ధికి సూచికగా నిలుస్తుంద‌ని చెప్పారు. దేశంలో ఆర్థిక కార్య‌క‌లాపాలు పెరుగుతున్న‌ట్ల‌యితే, కొనుగోళ్లు, అమ్మ‌కాల్లో కూడా పెరుగుద‌ల క‌న‌ప‌డుతుంద‌ని తెలిపారు. దేశంలో ఆర్థిక వృద్ధిలేన‌ట్ల‌యితే ప‌న్ను వ‌సూళ్లలోనూ పెరుగుద‌ల‌ ఉండ‌బోద‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాను ప్రోత్స‌హిస్తుండ‌డంతో ప‌న్ను చెల్లింపులూ పెరుగుతున్నాయ‌ని తెలిపారు.

Russia-Ukraine war: అత్యంత‌ ప్ర‌మాద‌క‌ర ఆయుధాల‌ను వాడుతున్న ర‌ష్యా!

క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ప్ర‌జ‌లు డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో చెల్లింపులపై ఆస‌క్తి చూపార‌ని అన్నారు. దీంతో ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానాల్లోనూ మార్పులు వ‌చ్చాయ‌ని తెలిపారు. స‌రైన స‌మ‌యంలోపు ప‌న్ను చెల్లించాల‌ని ప‌న్ను చెల్లింపుదారుల‌కు స‌మాచారం ఇస్తూ తాము తీసుకున్న చొర‌వ‌వ‌ల్ల కూడా మంచి ఫ‌లితాలు వ‌చ్చాయ‌ని చెప్పారు. డిజిటలైజేష‌న్‌ను తాము బాగా ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌ర ప‌న్ను వ‌సూళ్లు (ప్ర‌త్య‌క్ష ప‌న్నులు) రూ.14 ల‌క్ష‌ల కోట్లకుపైగానే న‌మోద‌య్యాయ‌ని చెప్పారు.