Goa : గోవాలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్

చాలామందికి డెస్టినేషన్ వెడ్డింగ్ పట్ల ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా గోవా బీచ్‌లో పెళ్లి చేసుకునేందుకు చాలామంది ఇష్టపడతారు. అక్కడ పెళ్లి చేసుకోవాలంటే గోవా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ అనుమతితోపాటు రుసుము చెల్లించాలి. ఇప్పుడు ఆ రుసుము రెండింతలవడంతో గోవాలో పెళ్లి చేసుకునేవారికి ఇది కష్టంగా మారచ్చు.

Goa : గోవాలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్

Goa Beach Wedding

Goa Beach Wedding : గోవా బీచ్‌లో పెళ్లి చేసుకోవాలంటే గోవా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ (JCZMA) వారికి అప్లై చేసుకోవాలి. అందుకోసం డబ్బులు కూడా కట్టాలి. అయితే తాజాగా ఈ రుసుమును రెండింతలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది గోవాలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

Goa Beach: గోవా బీచ్‌కు వెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించకుంటే జేబులకు చిల్లు తప్పదు ..

గోవాలో పెళ్లి చేసుకోవాలంటే అనుమతి కోసం 2020 వరకు రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేది. ఆ తరువాత రూ.50 వేలకు పెంచారు. ఇప్పుడు అది కాస్త డబుల్ అయ్యింది. ఇప్పుడు కనీసం ఐదు రోజుల వేడుకకు అనుమతి కావాలంటే లక్ష రూపాయలు చెల్లించాలట. అలాగే పార్టీలు చేసుకున్నా రోజుకు రూ.10 వేలు చెల్లించాలి. అయితే ఇక్కడ ఎక్కువగా సమ్మర్, వింటర్‌లలో పెళ్లిళ్లు జరుగుతాయట. ఈ సీజన్లలో అప్లికేషన్లు ఎక్కువగా వస్తాయని జీసీజెడ్ఎంఏ అధికారులు చెబుతున్నారు. ఇక వీటిని పరిశీలించడం వారికి పెద్ద తలనొప్పిని కలిగిస్తుందని అంటున్నారు. 800 చదరపు మీటర్ల తీరం వెయ్యిమందికి సరిపడా చోటుకు అనుమతి కావాలని కోరుతుంటారని అంటున్నారు.

Old monk tea : ఓల్డ్ మాంక్ ర‌మ్‌తో గ‌రం గ‌రం ఛాయ్ ‌.. గోవా బీచ్‌లో మ‌ట్టి క‌ప్పుల్లో మజా మజా చాయ్..

అలాగే డిసెంబర్, జనవరి నెలల్లో కూడా పార్టీలు, పెళ్లిళ్లకు అప్లికేషన్లు వస్తాయట. అయితే పార్టీలు మాత్రం సముద్రతీరంలో కంటే బీచ్ సమీపంలోని హోటళ్లలో జరుగుతాయట. ఏది ఏమైనా గోవా బీచ్‌‌లో పెళ్లి చేసుకోవడం కంటే ముందు అనుమతికే బోలెడు డబ్బులు ఖర్చుపెట్టాలన్నమాట.