Old monk tea : ఓల్డ్ మాంక్ రమ్‌తో గరం గరం ఛాయ్ .. గోవా బీచ్‌లో మట్టి కప్పుల్లో మజా మజా చాయ్..
ఓల్డ్ మాంక్ రమ్‌తో గరం గరం ఛాయ్ .. గోవా బీచ్‌లో మట్టి కప్పుల్లో మజా మజా చాయ్ తయారు చేస్తున్నాడో చాయ్ వాలా.

Old monk tea In Goa
Old monk tea In Goa : బ్లాక్ చాయ్ ,గ్రీన్ చాయ్, అల్లం చాయ్,బెల్లం చాయ్,ఇరానీ చాయ్..ఇలా చాయ్ లల్లో రకాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాయ్ ల్లో ఎన్నిరకాలు ఉన్నా కొత్త కొత్త ఫ్లేవర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. చాయ్ ప్రియులను అలరిస్తునే ఉన్నాయి. ఆకట్టుకుంటునే ఉన్నాయి. ఈక్రమంలో గోవా బీచ్ లో ఓ కొత్త రకం చాయ్ టేస్ట్ కు చాయ్ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. చాయ్ ప్రియులే కాదు మద్యం ప్రియులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఏంటీ మద్యానికి చాయ్ కు సంబంధం ఏంటీ అంటారా? అదే మరి ఈ చాయ్ స్పెషాలిటీ..గోవా అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి అందమైన బీచ్ లు..మద్యం…ఇప్పుడు తాజాగా ఓ చాయ్ కూడా గోవా ప్రియులను ఆకట్టుకుంటోంది. అదే ‘ఓల్డ్ బాంక్ రమ్ చాయ్’..!!
చాయ్ ల్లో ఎన్ని రకాలున్నా…ఎన్ని రుచులున్నా నా ఓల్డ్ మాంక్ చాయ్ టేస్టే వేరు అంటున్నాడీ చాయ్ వాలా…అదే నండీ ఓల్డ్ మాంక్ రమ్ చాయ్ వాలా..తన ఛాయ్‌కి గిరాకీ పెంచుకునేందుకు వెరైటీగా ఆలోచించాడు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేసింది అనే మాట వింటుంటాం. అలా ఈ ఓల్డ్ మాంక్ రమ్.. గరం గరం ఛాయ్…కూడా ఈ టీవాలా గిరాకీనే మార్చేసింది. ఈ ఓల్డ్ మాంక్ రమ్.. గరం గరం ఛాయ్ ని కలిపి మరీ టీ తయారు చేసి మట్టికప్పులో పోసి ఇస్తుంటే ఎగబడి మరీ తాగేస్తున్నారు జనాలు.
గోవా బీచ్ లో ఈ ఓల్డ్ మాంక్ రమ్.. గరం గరం ఛాయ్…తెగ ఫేమస్ అయిపోయింది. ఈ ఛాయ్ పేరు మాత్రమే కాదు దీని తయారీ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. ఛాయ్ తయారీ పాత్రలో మొదట బెల్లం పొడి వేసిమంటపై ఉంచి, తర్వాత అందులో ఓల్డ్ మాంక్ రమ్ కొంచెం పోటీ..కొద్దిసేపటికి అందులో టీ కలిపాడీ చాయ్ వాలా..అలా వేడి వేడి టీని మట్టి కప్పుల్లో పోసి అందిస్తుంటే జనాలు లొట్టలేసుకుని మరీ తాగేస్తున్నారు.
టూరిస్ట్‌లు ఎక్కువగా వచ్చే బీచ్‌లో స్టాల్ ఏర్పాటుచేసుకున్నాడు ఇతను. దాంతో, ఈ బీచ్‌కి వచ్చినవాళ్లు ఈ వెరైటీ ఛాయ్‌ని టేస్ట్ చేసి మరీ వెళ్తున్నారు. కొంతమంది మన్స్ మోర్ అంటుంటే మరికొందరు మాత్రం ఓకే వెరైటీ ఉంది అంటున్నారు. అతను టీ తయారుచేస్తున్న వీడియోను ఒక యూజర్ ట్విట్టర్‌లో పెట్టటంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మీరు కూడా గోవా వెళ్లినప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండీ..ఈ ఓల్డ్ మాంక్ రమ్ చాయ్..
Old monk tea in Goa. The end is near!!! ? pic.twitter.com/1AYI0ikR40
— Dr V ?? (@DrVW30) November 3, 2022
Old monk tea,Goa,