Pooja Hegde : బుట్టబొమ్మకి కలిసిరాని 2022.. ఇయర్ ఎండింగ్ అయినా హిట్ కొడుతుందా?

 సినిమాల పరంగా పూజా హెగ్డేకి ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోలతో నటించిన సినిమాలన్నీ బోల్తాకొట్టేశాయి. గత సంవత్సరం బుట్టబొమ్మ పూజాహెగ్డే ఖాతాలో వరుసగా సక్సెస్ లు పడ్డాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ.............

Pooja Hegde : బుట్టబొమ్మకి కలిసిరాని 2022.. ఇయర్ ఎండింగ్ అయినా హిట్ కొడుతుందా?

Bad year for Pooja Hegde

Pooja Hegde :  సినిమాల పరంగా పూజా హెగ్డేకి ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోలతో నటించిన సినిమాలన్నీ బోల్తాకొట్టేశాయి. గత సంవత్సరం బుట్టబొమ్మ పూజాహెగ్డే ఖాతాలో వరుసగా సక్సెస్ లు పడ్డాయి. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ చిన్న పెద్ద సినిమాలతో హిట్స్ కొట్టింది. కానీ ఆ ఏడాదే ఆమెకు బ్యాడ్ పీరియడ్ నడిచింది. 2022 స్టార్టింగ్ లో రిలీజైన ‘రాధేశ్యామ్, బీస్ట్ , ఆచార్య, ఎఫ్ 3’ లాంటి బడా సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. అయినప్పటికీ అమ్మడి అవకాశాలకేమీ కొదవలేదు. ఇదే కాకుండా పూజాకి ఓ సినిమా షూటింగ్ లో కాలికి గాయమై దాదాపు నెల రోజులు షూటింగ్స్ కి దూరమైంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు బిగ్ మూవీస్, టాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలోనూ నటిస్తోంది పూజా హెగ్డే. మహేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ మూవీస్ అమ్మడికి కీలకంగా మారాయి. ఈ మూడింట్లో ఏ సినిమా హిట్టయినా పూజా తిరిగి ఫామ్ లోకి వస్తుంది.

Manchu Lakshmi : శ్రీకాకుళంలో మంచు లక్ష్మి.. ప్రభుత్వ పాఠశాలల్లో ‘టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌’

ఈ డిసెంబర్ 23న రిలీజవుతున్న ‘సర్కస్’ మూవీపై పూజా కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ సినిమా సక్సెస్ తో 2022 సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ముగించాలనుకుంటోంది పూజా. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇందులో రణవీర్ సింగ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ సినిమాపై మరింతగా హైప్ క్రియేట్ చేసింది. హిట్స్ లేని బాలీవుడ్ కు, ఫామ్ లేని పూజా హెగ్డేకి సర్కస్ సూపర్ కమ్ బ్యాక్ గిఫ్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పూజా నమ్మకం ఎంత వరకూ నిలబడుతుందో చూడాలి.