Balakrishna : సుమకి చెంప దెబ్బలు పడాలి.. జగపతిబాబు సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

జగపతిబాబు ‘రుద్రంగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య యాంకర్ సుమతో.. నీకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు పడాలి అంటూ వ్యాఖ్యానించాడు.

Balakrishna : సుమకి చెంప దెబ్బలు పడాలి.. జగపతిబాబు సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..

Balakrishna Fun With Anchor Suma at Jagapathi Babu Rudrangi pre release event

Updated On : June 30, 2023 / 12:09 PM IST

Balakrishna : జగపతిబాబు (Jagapathi Babu), మమతా మోహన్‌దాస్‌ (Mamta Mohandas), ఆశిష్‌గాంధీ, విమలా రామన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రుద్రంగి’ (Rudrangi). తెలంగాణ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమాకి అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించాడు. జులై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్‌లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Ram Charan : రామ్ చరణ్ కూతురి బారసాల నేడే.. బంగారు ఊయల బహుమతిగా ఇచ్చిన అంబానీ!

ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. సుమకి చెంప దెబ్బలు పడాలి అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ వచ్చినప్పుడు సుమ మాట్లాడుతూ.. “నేను ఆయన వచ్చారు అని చెప్పకుండానే చప్పట్లు కొడతారా? అంటూ వ్యాఖ్యానించింది. దీనికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. “ఈమెకు కొంచెం చెంప దెబ్బలు అప్పుడప్పుడు అవసరం. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పులు తీసుకోని చెప్పు దెబ్బలు కొడుతోంది మనల్ని. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా బ్రతుకుతున్నాడో ఈమెతో” అంటూ కాసేపు సుమని ఆటపట్టించాడు.

Indian 3 : సీక్వెల్ కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే మూడో పార్ట్ గురించి హింట్.. ఉదయనిధి స్టాలిన్‌ కామెంట్స్!

ఇంతలో జగపతిబాబు మైక్ తీసుకోని.. “నీకోసం (సుమ) బాలయ్య డేట్ కూడా మార్చుకున్నాడు. ఈ ఈవెంట్ ని 28వ తారీఖున చేయాల్సింది. కానీ నీకు 29న కుదురుతుంది అంటే ఆయన కూడా డేట్ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇక మీ ఇద్దరు కొట్టుకోండి” అంటూ మరింత ఆట పట్టించాడు. అలాగే బాలయ్య మాట్లాడేటప్పుడు అభిమానులు ‘కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ’ అంటూ అరుస్తుంటే, బాలకృష్ణ ఆ స్లోగన్ కి రియాక్ట్ అవుతూ.. “నన్ను సెక్సీ అంటే ఇప్పుడు సుమ ఫీల్ అవుతుంది. ఆపండి అయ్యా బాబు” అంటూ సరదాగా మాట్లాడారు. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి..