Unstoppable : ఎవ్వరికి ఇవ్వని ఆఫర్ ప్రభాస్ కి ఇచ్చిన బాలయ్య..

ప్రభాస్ కి ఎక్కువ సిగ్గు, మొహమాటం అన్న సంగతి తెలిసిందే. ఎక్కువ మాట్లాడడు అని కూడా తెలిసిందే. దీని గురించి బాలయ్య షోలో ప్రస్తావించారు. నీకు ఎక్కువ మొహమాటం, సిగ్గు, మొహమాటంకి బ్రాండ్ అంబాసిడర్ అంట అని అనడంతో...................

Unstoppable : ఎవ్వరికి ఇవ్వని ఆఫర్ ప్రభాస్ కి ఇచ్చిన బాలయ్య..

Balakrishna gives offer to Prabhas in Unstoppable

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ లో ప్రభాస్ ని తీసుకొచ్చారు. ప్రభాస్ ఈ షోకి వస్తున్నాడు అని తెలియడంతో ముందునుంచి ఈ ఎపిసోడ్ పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి ఫ్యాన్స్ కి మరింత జోష్ ఇచ్చింది ఆహా టీం.

ప్రభాస్ అన్‌స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమ్ అవుతుందని చెప్పినా డిసెంబర్ 29 రాత్రే రిలీజ్ చేసి అభిమానులకి ముందుగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఇచ్చింది ఆహా. ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ఆహా సర్వర్లు ఎక్కువ ఫ్లోటింగ్ తో క్రాష్ అయ్యాయి అంటే ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ఎపిసోడ్ లో ప్రభాస్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ప్రభాస్ నటుడిగా మారి 20 సంవత్సరాలు అవుతుండటంతో అభిమానులతో స్పెషల్ షూట్ చేసి ప్రోమో కూడా వేశారు. ఇక ప్రభాస్ కి ఎక్కువ సిగ్గు, మొహమాటం అన్న సంగతి తెలిసిందే. ఎక్కువ మాట్లాడడు అని కూడా తెలిసిందే. దీని గురించి బాలయ్య షోలో ప్రస్తావించారు. నీకు ఎక్కువ మొహమాటం, సిగ్గు, మొహమాటంకి బ్రాండ్ అంబాసిడర్ అంట అని అనడంతో ప్రభాస్.. ఈ మధ్య కొంచెం తగ్గింది సర్. నాన్న గారి దగ్గర నుంచి వచ్చింది అది. పెదనాన్న మాత్రం దీనికి వ్యతిరేకం. చిన్నప్పటి నుంచి నన్ను ఈ విషయంలో బాగా తిట్టారు ఎందుకు సిగ్గు పడతావు అని. పెదనాన్న దగ్గర్నుంచి ఇదొక్కటే నేర్చుకోలేకపోయాను అని అన్నాడు.

Prabhas : పెళ్లి పై ప్రభాస్ కామెంట్స్.. చేసుకుంటాను కానీ..

నీకు బాగా మొహమాటం కాబట్టి ఇప్పటివరకు నా షోలో ఎవ్వరికి ఇవ్వని ఒక ఆఫర్ నీకు ఇస్తున్నాను అంటూ నెర్వస్ మీటర్ అని ఒక సౌండ్ వచ్చే డివైజ్ ఇచ్చాడు బాలయ్య. ఏదన్నా ప్రశ్న స్కిప్ చేయాలనుకుంటే, చెప్పకూడదు అనుకుంటే అది నొక్కితే సౌండ్ వస్తుంది, అప్పుడు ఆ ప్రశ్నని వదిలేద్దాం అని అన్నారు బాలయ్య. అయితే ఎపిసోడ్ లో రెండు సార్లు ప్రభాస్ ఆ మీటర్ నొక్కినా బాలయ్య సరదాగా వేరే ప్రశ్నలు అడిగారు. ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగింది.