NOTA Banner: బ్రాహ్మణ వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని, బ్రాహ్మణ ఓటర్లు నోటాకు ఓటేయాలంటూ బ్యానర్లు

NOTA Banner: బ్రాహ్మణ వ్యక్తికి టికెట్ ఇవ్వలేదని, బ్రాహ్మణ ఓటర్లు నోటాకు ఓటేయాలంటూ బ్యానర్లు

Banners urging voters to opt for NOTA put up in Pune

NOTA Banner: తొందరలో జరగనున్న పూణె ఉపఎన్నికల్లో నోటాను ఎంచుకోవాలని బ్రాహ్మణ ఓటర్లను కోరుతూ వెలిసన బ్యానర్లు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్రాంబాగ్ పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ముక్తా తిలక్ మరణంతో కస్బా పేత్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు సీనియర్ కార్పొరేటర్ హేమంత్ రసానేకు టిక్కెట్ ఇచ్చారు. ఇక మహా వికాస్ అఘాడీ నుంచి రవీంద్ర ధంగేకర్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ బ్రాహ్మణేతరులే.

USA Firing Six Killed : అమెరికా మిస్సిస్సిప్పిలో కాల్పులు.. ఆరుగురు మృతి

ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బ్రాహ్మణ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలపై వీరు నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపగలరు. అయితే ఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్థి బ్రాహ్మణులు లేకపోవడంతో ఈ ఉప ఎన్నికలో నోటాకు ఓటేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌లో “మేము గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాము. కస్బా పేత్ ప్రాంతం కాకాసాహెబ్ గాడ్గిల్, ముక్తా తిలక్, గిరీష్ బాపట్ కుటుంబానికి చెందింది. ఎందుకు దీన్ని వారి నుంచి తీసుకెళ్లారు? అందుకే మేము నోటాకు ఓటేయాలని నిర్ణయించుకున్నాం’’ అని రాసుకొచ్చారు.

Pawar on Shiv Sena: శివసేనపై ఈసీ నిర్ణయం అనంతరం ఉద్ధవ్ థాకరేకు శరద్ పవార్ కీలక సూచన

మొదట్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్, బీజేపీ బ్రాహ్మణ అభ్యర్థులనే నిలబెట్టాలని అనుకున్నాయి. అయితే స్థానిక నాయకత్వంలో ఉన్న బలాల దృష్ట్యా ఇతర అభ్యర్థులు బలంగా ఉండడంతో వారిని ఎంచుకున్నాయి. ఈ నియోజకవర్గంలో బ్రాహ్మణ జనాభా సుమారు 13 శాతం ఉంటుంది. ఎమ్మెల్యే ముక్తా తిలక్ మరణం తర్వాత, ఆమె భర్త శైలేష్ తిలక్ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను ప్రదర్శించారు. అయితే పార్టీ అదే ప్రాంతం నుంచి నాలుగుసార్లు కార్పొరేటర్‌గా గెలవడమే కాకుండా, దగ్దుషేత్ హల్వాయి గణేష్ దేవాలయంలో ట్రస్టీగా ఉన్న రసానేని ఎన్నుకుంది.

Shiv Sena: అసలైన పులి షిండేనే.. ఉద్ధవ్ థాకరేకు షాకిస్తూ శివసేను షిండేకు కేటాయించిన ఈసీ

టికెట్ నిరాకరించినందుకు మనస్తాపానికి గురైన తిలక్ పార్టీ నిర్ణయం బ్రాహ్మణుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని అన్నారు. ఆ మరుసటి రోజే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో చాలా బ్యానర్లు కనిపించాయి. అయితే ఓటర్లను గందరగోళపరిచి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే ఈ బ్యానర్లను పెట్టాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు ఫిబ్రవరి 6 న, బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే బ్రాహ్మణ ఓటర్లలో నిరాశపై స్పందిస్తూ “బ్రాహ్మణ సంఘం ఎల్లప్పుడూ బీజేపీకి మద్దతు ఇస్తుంది. ఈసారి రాసానేకు కూడా వారి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది” అని అన్నారు.