Bellamkonda Sreenivas: హిందీ ‘ఛత్రపతి’ అప్పుడే వస్తాడా..?
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ మూవీలో ఈ హీరో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయ్యింది.

Bellamkonda Sreenivas Chatrapathi Remake To Come At This Time
Bellamkonda Sreenivas: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ మూవీలో ఈ హీరో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు వివి.వినాయక్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయ్యింది.
Bellamkonda Sreenivas: పవన్ డైరెక్టర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ.. నిజమేనా?
కాగా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసినా, ఇంకా ఈ సినిమా పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Bellamkonda Sreenivas : బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..
అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గా్ల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. సమ్మర్ అయితే, ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఈ సినిమాలో నుష్రత్ భరుచ్చా హీరోయిన్‌గా నటిస్తోండగా, తనిషిక్ బచ్చి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.