Governor Dhankhar : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమాచారం అందివ్వాలని సూచించినా..ఇంతవరకు ఆ పని జరగలేదని వెల్లడించారు...

Governor Dhankhar : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Bengal

Updated On : December 4, 2021 / 1:41 PM IST

Bengal A Gas Chamber For Democracy : రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగడం లేదంటూ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడేందుకు కూడా రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎంగా ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం తనను రాష్ట్ర గవర్నర్ గా పనిచేయడానికి అనుమతించడం లేదని, రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమాచారం అందివ్వాలని సూచించినా..ఇంతవరకు ఆ పని జరగలేదని వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం నుంచి స్పందన కోరే అధికారం గవర్నర్ కు ఉంటుందని, కానీ..ఆమె సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

Read More : Ajaz Patel: భారత్‌లో పుట్టి భారత్‌పైనే అత్యుత్తమ రికార్డు.. 10వికెట్లు తీసిన కివీస్ బౌలర్

2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఆయన ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదని, తనకు తెలియకుండానే..కొన్ని పనులు జరుగుతున్నాయన్నారు. డజన్ కు పైగా వైస్ చాన్స్ లర్లను నియమించారని విమర్శించారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఐసీయూలో ఉందని…హైకోర్టు జడ్జీ ఒకరు తనతో చెప్పారన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో…ఆ జడ్జీ వ్యాఖ్యలే ఉదహారణ అని వ్యాఖ్యానించారు.

Read More : Telangana crime : పరువు కోసం..కూతుర్ని చంపేసిన తల్లి

గత కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, సీఎం మమతా బెనర్జీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో గవర్నర్‌ అవినీతిపరుడంటూ సీఎం మమతా బెనర్జీ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. 1996 నాటి జైన్ హవాలా వ్యవహారంలో ముడుపులు అందుకున్న రాజకీయ నేతల జాబితాలో ఆయన కూడా ఉన్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. తాజాగా సీఎంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.