Telangana crime : పరువు కోసం..కూతుర్ని చంపేసిన తల్లి

తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుంటుందని..కూతుర్ని చంపేసింది తల్లి.

Telangana crime : పరువు కోసం..కూతుర్ని చంపేసిన తల్లి

Telangana Crime

woman with mother’s help kills her daughter : ఈ కంప్యూటర్ కాలంలో కూడా కులాల కోసం కొట్లాటలే కాదు..ఏకంగా కన్నబిడ్డల్నే కసాయివారిలా చంపేస్తున్నారు. కులాంత వివాహం చేసుకున్న కూతుళ్లను..కడతేరుస్తున్న దారుణం సంస్కృతి అంతకంతకు పెరుగుతోంది. అటువంటి మరో పరువు హత్య జరిగింది తెలంగాణలోని వరంగల్ జిల్లాలో. కూతురు కులాంతర వివాహం చసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. అమ్మమ్మా..అమ్మ కలిసి 17 ఏళ్ల కూతుర్ని అంత్యం దారుణంగా చంపేశారు. మనుమరాలు అని కూడా చూడకుండా అమ్మమ్మా..కన్నబిడ్డ అని కూడా చూడకుండా తల్లీ కూతురు ఉసురు తీశారు.

Read more : Father Kills Daughter : దారుణం.. భార్య మీద కోపంతో ఏడాది పాపకు కరెంట్​ షాకిచ్చి చంపిన తండ్రి

వరంగల్ జిల్లాలోని పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి వివాహం చేసింది సమ్మక్క. రెండో కూతురికి 17 ఏళ్లు. 10th క్లాస్ చదువుతోంది. భర్త చనిపోవటంతో సమ్మక్క కూరగాయలు అమ్ముతు కుటుంబాన్ని పోషిస్తోంది. ఈక్రమంలో సమ్మక్క రెండో కూతురు అంజలి పర్వతగిరిలోనే నివసిస్తున్న రాయపురం ప్రశాంత్‌ అనే వేరు కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి సమ్మక్క కూతురిని చాలా సార్లు మందలించింది.

కానీ అంజలి వినలేదు. ప్రశాంత్ తో కలిసి తిరగటం మానలేదు. దీంతో సమ్మక్క కూతుర్ని కొట్టి మరీ చెప్పింది. ఈ ప్రేమలు వద్దు బుద్ధిగా చదువుకోమని. అయినా అంజలి తీరు మారకపోవడవంతో సమ్మక్క తీవ్ర ఆగ్రహంతో విచక్షణ మరిచిపోయింది. తన కూతురు వేరే కులానికి చెందిన ప్రశాంత్ ను పెళ్లి చేసుకుంటే తమ పరువుపోతుందని భావించిన సమ్మక్క.. తన తల్లి యాకమ్మతో కలిసి నవంబర్ 19న అర్థరాత్రి అంజలి నిద్రపోతుండగా..ఆమె ముఖంపై దిండుపెట్టి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేసింది.

Read more : West Bengal‌ : కదులుతున్న రైల్లో నుంచి దూకిన ఇద్దరు మహిళలు.. ప‌రుగెత్తుకెళ్లి ప్రాణాలు కాపాడిన రైల్వే ఎస్సై

తరువాత ఏమీ తెలియనట్లు..కూతురు చనిపోయింది అంటూ ఏడుపులు పెడబొమ్మలు మొదలు పెట్టింది. దీంతో స్థానికులు రాత్రి వరకు బాగానే ఉన్న అమ్మాయి తెల్లారేసరికి చనిపోవటం ఏంటీ అంటూ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ క్రమంలో అంజలి మరణవార్త తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి అనుమానాస్పద మరణం కింద కేసును నమోదు చేశారు.స్థానికులను కూడా ప్రశ్నించారు. అలా వారి విచారణలో తల్లి సమ్మక్కపై అనుమానం కలిగి తల్లి, అమ్మమ్మను గట్టిగా ప్రశ్నించేసరికి అసలు విషయం ఒప్పుకున్నారు. కూతురు కులాంతర వివాహం చేసుకుంటుందనే భయంతోనే హత్య చేశామని ఒప్పుకున్నారు.