Bheemla Nayak: నెక్లెస్ రోడ్డులో భీమ్లా నాయక్ హవా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను...

Bheemla Nayak: నెక్లెస్ రోడ్డులో భీమ్లా నాయక్ హవా!

Bheemla Nayak Cutout On Necklace Road

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రిప్టు, మాటలను అందించాడు. మలయాళంలో సూపర్ సక్సెస్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’‌కు తెలుగు రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఆయన్ను ఢీకొట్టే పాత్రలో యంగ్ హీరో రానా దగ్గుబాటి నటించారు.

Bheemla Nayak: పార్టీకి లేటైంది పుష్ప..!

కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి, తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆహా, డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలు సంయుక్తంగా ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పవన్ ఓటీటీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. భారీ వ్యూస్‌తో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. కాగా భీమ్లా నాయక్ చిత్రం తాజాగా మరో అరుదైన ఫీట్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Bheemla Nayak: ఓటీటీలో వచ్చేస్తుంది.. ఇక హిందీ రిలీజ్ లేనట్లేనా?

ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ అభిమానులు, డిస్నీ‌ప్లస్ హాట్ స్టార్ కలిసి భీమ్లా నాయక్ చిత్రానికి సంబంధించి ఓ భారీ కటౌట్‌ను నెక్లెస్ రోడ్డుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ చూసేందుకు అభిమానుల భారీ స్థాయిలో అక్కడికి చేరుకుంటున్నారు. తమ అభిమాన హీరో స్పెషల్ కటౌట్‌ను చూసి వారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన భీమ్లా నాయక్‌లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా థమన్ ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు.