Bheemla Nayak: కథ మీద ప్రేమను చంపుకున్నప్పుడే మనం అనుకున్నది వస్తుంది – త్రివిక్రమ్

పోలీస్ గెటప్ లో మరోసారి కనిపించి మెప్పించిన పవన్ కల్యాణ్ చూసి అభిమానులు నీరాజనాలు పలికారు.సినిమా సక్సెస్ పై భీమ్లా నాయక్ సినిమా టీం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా...

Bheemla Nayak: కథ మీద ప్రేమను చంపుకున్నప్పుడే మనం అనుకున్నది వస్తుంది – త్రివిక్రమ్

Bheemla Nayak

Bheemla Nayak: అభిమానుల కోటి ఆశల మధ్య అంగరంగ వైభవంగా రోజుకు ఐదు షోలతో రిలీజ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది భీమ్లా నాయక్. పోలీస్ గెటప్ లో మరోసారి కనిపించి మెప్పించిన పవన్ కల్యాణ్ చూసి అభిమానులు నీరాజనాలు పలికారు. థియేటర్ స్క్రీన్ పై ధీటుగా కనిపించిన ఆరడుగుల కటౌట్.. రానా ప్రదర్శనకు మంత్ర ముగ్దులవుతున్నారు.

సినిమా సక్సెస్ పై భీమ్లా నాయక్ సినిమా టీం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వేదికగా ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడిన తమన్.. ‘ఈ సినిమా పెద్ద తుఫాన్ అని తెలుసు. షల్ మీడియాలో, ఓటీటీలో రిలీజ్ అప్పుడు కొంత అనవసరమైన ప్రోపగాండా జరిగింది. ఈ సక్సెస్ కోసం మేమంతా ఎంతో హార్డ్ వర్క్ చేశాం. పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఇష్టం. ఈ ప్రాజెక్టకు వర్క్ చెయ్యడం హ్యాపీగా అనిపించింది. ఈ సక్సెస్ మా అందరిది’ అని వివరించారు.

Read Also : తమన్.. లాలా భీమ్లా.. స్టెప్పులు అదిరేలా..

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘తమన్ దర్శకుడు ఆలోచన మేరకు ఆలోచన చేస్తాడు. వర్క్ విషయంలో సీరియస్‌గా ఉంటాడు. సక్సెస్ అనేది వూరికే రాదు. తమన్ హాట్సాఫ్’ అని అభినందించారు.

దర్శకుడు సాగర్ కే చంద్ర మాట్లాడుతూ ‘బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా వుంది. తమన్ సంగీతం వల్ల స్టొరీ సోల్‌కు సెట్ అయింది. మాకు ఎంతో సపోర్ట్ చేసిన త్రివిక్రమ్ గారికి థాంక్స్’ అని కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు పెద్ద హర్డిల్ ఒరిజినల్ వెర్షన్ నుంచి దూరంగా జరిగి కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. మంచి కథ ఎప్పుడు ధ్రుతరాష్ట్దుని కౌగిలిలా అంటి పెట్టుకొని ఉంటుంది దాని మీద ప్రేమను చంపుకోవాలి అప్పుడే మనం అనుకున్నది వస్తుంది’

Read Also: ఆయన నీతులన్నీ.. మాటలవరకే..!

‘ఇండియన్ వైడ్ గా నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను వస్తున్న యాక్టర్స్ ఎంతో బాగా నటిస్తున్నారు. ఇందులో పని చేసిన అందరూ ఈ సినిమాని ప్రేమించి పని చేశారు. డైరెక్టర్ సాగర్ బాగా హ్యాండిల్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు రానా కరోనా టైం లో కూడా ఎంతో రిస్క్ చేసి ప్యాషన్‌తో పని చేశారు. తమన్ నా ఫ్యామిలీ. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం గ్రేట్.. తమన్ టైం స్టార్ట్ అయ్యింది’ అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు మాటల మాంత్రికుడు.