Bhola Shankar : భారీ కలకత్తా సెట్‌లో మొదలుపెట్టేసిన భోళాశంకర్.. వాల్తేరు వీరయ్య రిటర్న్ టు సెట్స్..

గత కొన్ని రోజులుగా వాల్తేరు వీరయ్య సినిమా బిజీలో ఉండి భోళాశంకర్ సినిమా షూట్ కి గ్యాప్ ఇచ్చారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య రిలీజయి హిట్ అవ్వడంతో చిరు ప్రస్తుతం ఫ్రీ అయ్యారు. దీంతో భోళా శంకర్ సినిమా షూట్ ని మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా నేడు................

Bhola Shankar : భారీ కలకత్తా సెట్‌లో మొదలుపెట్టేసిన భోళాశంకర్.. వాల్తేరు వీరయ్య రిటర్న్ టు సెట్స్..

Bholaa Shankar new schedule starts in huge sets

Bhola Shankar :  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి భారీ విజయం సాధించాడు చిరంజీవి. మూడు రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక చిరు చేతిలో ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ దశలో ఉంది.

గత కొన్ని రోజులుగా వాల్తేరు వీరయ్య సినిమా బిజీలో ఉండి భోళాశంకర్ సినిమా షూట్ కి గ్యాప్ ఇచ్చారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య రిలీజయి హిట్ అవ్వడంతో చిరు ప్రస్తుతం ఫ్రీ అయ్యారు. దీంతో భోళా శంకర్ సినిమా షూట్ ని మొదలుపెట్టారు చిత్రయూనిట్. తాజాగా నేడు మంగళవారం రోజు సినిమా కోసం వేసిన భారీ కోల్‌కత్తా సెట్ లో దర్శకుడు మెహర్ రమేష్, నిర్మాత అనిల్ సుంకర కలిసి ఫొటో దిగారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. భోళా శంకర్ సినిమా కోసం వేసిన భారీ కోల్‌కత్తా సెట్ లో కొత్త షెడ్యూల్ షూట్ మొదలయింది అని తెలిపారు చిత్రయూనిట్. త్వరలోనే చిరంజీవి కూడా షూట్ లో జాయిన్ అవ్వనున్నట్టు తెలుతెస్తుంది.

Pawan Kalyan : కనుమ స్పెషల్.. గోవుల్ని పూజించి ఆహరం అందించిన పవన్..

ఈ భోళా శంకర్ సినిమా తమిళ్ వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని సమ్మర్ వరకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన చిరంజీవి ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడా చూడాలి మరి.