Bhumi Pednekar : బాలీవుడ్‌లో లింగ వివక్ష.. హీరోయిన్లకి సగం పారితోషకం..

భూమి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''కరోనా మహమ్మారి ఆడ, మగ అని తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసింది. కానీ కరోనా సమస్యలకి తోడు ఆడవారికి ఎప్పుడూ ఉండే మరిన్ని సమస్యలు కూడా.......

Bhumi Pednekar : బాలీవుడ్‌లో లింగ వివక్ష.. హీరోయిన్లకి సగం పారితోషకం..

Bhumi

Bhumi Pednekar :  బాలీవుడ్ లో గతంలో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్, రేసిజం పేర్లు బాగా వినిపించాయి. చాలా మంది స్టార్లు, పెద్ద నిర్మాతలు కొత్త వాళ్ళని, రంగు తక్కువ ఉన్నవాళ్ళని, ఆడవాళ్ళని తక్కువ చేసి చూసేవారు. వీటిపై గతంలోనే వ్యతిరేకతలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్ లో లింగ వివక్ష ఉందంటూ ఓ బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది.

బాలీవుడ్‌ నటి భూమి పడ్నేకర్‌ తాజాగా బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లింగ వివక్షపై స్పందించింది. తన సినిమా ‘బదాయి దో’ గతవారం రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భూమి పడ్నేకర్ బాలీవుడ్ లో ఉన్న లింగ వివక్ష గురించి మాట్లాడింది.

Ester : విడాకులు తీసుకున్నాక చాలా సంతోషంగా ఉన్నాను.. నోయల్ మాజీ భార్య, హీరోయిన్ ఎస్తర్

భూమి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ”కరోనా మహమ్మారి ఆడ, మగ అని తేడా లేకుండా అందరినీ ఇబ్బందులకు గురి చేసింది. కానీ కరోనా సమస్యలకి తోడు ఆడవారికి ఎప్పుడూ ఉండే మరిన్ని సమస్యలు కూడా జతయ్యాయి. కోవిడ్‌ సమయంలో చాలా మంది నిర్మాతలు ఆడవాళ్ల పారితోషికం కట్‌ చేసి ఇచ్చేవారు. సగం లేదా 70 శాతం పారితోషికం ఇచ్చేవారు. అడిగితే కరోనా కష్టాలు అని చెప్పేవారు. కానీ మగవారికి మాత్రం అలాంటి కోతలేమీ లేకుండా ఎప్పటిలాగే పూర్తి రెమ్యునరేషన్‌ అందచేశారు. కోవిడ్‌ పరిస్థితిని అర్థం చేసుకొని పారితోషికం తగ్గించుకోమని ఏ నిర్మాత కూడా హీరో దగ్గరకు వెళ్లి అడగలేదు. కానీ ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి మహిళల దగ్గరకు వచ్చి మాత్రం రెమ్యునరేషన్‌లో కొంత కోత పెట్టాల్సిందే అని చెప్పారు. హీరోల జోలికి వెళ్లరు కానీ హీరోయిన్లనే బలి చేస్తారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది’ అని ఈ లింగ వివక్షని విమర్శించింది భూమి పడ్నేకర్.