Ester : విడాకులు తీసుకున్నాక చాలా సంతోషంగా ఉన్నాను.. నోయల్ మాజీ భార్య, హీరోయిన్ ఎస్తర్

నోయల్ తో విడాకుల గురించి ఎస్తర్ మాట్లాడుతూ..''విడాకుల సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నిటికి సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు......

Ester : విడాకులు తీసుకున్నాక చాలా సంతోషంగా ఉన్నాను.. నోయల్ మాజీ భార్య, హీరోయిన్ ఎస్తర్

Ester

Ester :  ‘భీమవరం బుల్లోడు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్‌ నోరోన్హ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత ప్రముఖ ర్యాప్ సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ నోయల్ ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. అయితే పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత నుంచి ఒకటి రెండు తప్ప ఎక్కువగా సినిమాల్లో కనపడలేదు.

తాజాగా ఎస్తర్ హీరోయిన్ గా ‘69 సంస్కార్‌ కాలనీ’ అనే సినిమాలో నటించింది. మార్చి 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఎస్తర్‌ పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. సినిమాతో పాటు తన విడాకుల విషయం గురించి కూడా మాట్లాడింది.

Chinnikrishna : ప్రముఖ రచయిత చిన్నికృష్ణ పై దాడి. .పోలీసులకి ఫిర్యాదు..

నోయల్ తో విడాకుల గురించి ఎస్తర్ మాట్లాడుతూ..”విడాకుల సమయంలో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ ఎప్పుడైతే అన్నిటికి సిద్ధపడి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానో అప్పుడు ఫ్రీ అయ్యా. బయటి వాళ్ళ విడాకుల గురించి వినడమే కానీ నాకే ఈ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. దీనిపై నా ఫ్యామిలీకి నేను ఎలా సమాధానం చెప్పుకోవాలని భయపడ్డాను. కానీ నా తల్లిదండ్రులు నాకు అండగా నిలబడ్డారు. దీంతో నాకు రెట్టింపు ధైర్యం, ఎనర్జీ వచ్చింది. విడాకుల తర్వాత నేను మరింత ఫ్రీగా, సంతోషంగా ఉన్నాను.” అని తెలిపింది.