Chinnikrishna : ప్రముఖ రచయిత చిన్నికృష్ణ పై దాడి. .పోలీసులకి ఫిర్యాదు..

రచయిత చిన్నికృష్ణ తనపై కొందరు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని గతంలో కొందరు ఆక్రమించుకున్నారని........

Chinnikrishna :  ప్రముఖ రచయిత చిన్నికృష్ణ పై దాడి. .పోలీసులకి ఫిర్యాదు..

Chinni Krishna

Updated On : February 20, 2022 / 2:26 PM IST

Chinni Krishna :  ‘గంగోత్రి’, ‘న‌ర‌సింహ‌నాయుడు’, ‘ఇంద్ర’… లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కథలు అందించారు రైటర్ చిన్నికృష్ణ. గతంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలకి ఆయనే కథలు అందించారు. ప్రస్తుతం కొన్ని రోజులుగా సినీ పరిశ్రమకి దూరంగా ఉంటున్నారు. ఆయన కథలు అందించిన చాలా సినిమాలు భారీ విజయం సాధించాయి. ఒకప్పుడు స్టార్ రైటర్ గా పేరు పొందారు. తాజాగా కొంతమంది వ్యక్తులు ఆయనపై దాడి చేశారు.

Tollywood : ముగిసిన టాలీవుడ్ కీలక సమావేశం..

రచయిత చిన్నికృష్ణ తనపై కొందరు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో ఆయన పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. అంతేకాక తన భూమిని కబ్జా చేశారంటూ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆయన భూమిని కబ్జా చేసిన కొంతమంది వ్యక్తులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఆయనపై దాడి చేశారని ఆరోపిస్తూ చిన్నికృష్ణ శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.