వివాదాస్పదంగా దేత్తడి హారిక నియామకం..

వివాదాస్పదంగా దేత్తడి హారిక నియామకం..

Harika Appointed TS Tourism Ambassador: తెలుగు బిగ్‌ బాస్ 4 ఫేం.. దేత్తడి హారిక నియామకం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నియామకం చేపట్టారు. ఇందులో భాగంగా హరితా హోటల్స్‌ ప్రమోషన్స్‌లో హారిక పాల్గొననున్నారు. అయితే హారిక నియామకం విషయంలో తనకు సమాచారం లేకపోవడంపై టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు.

హారిక నియామకం తర్వాత హరితా హోటల్స్‌ ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొంటారని కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా చెప్పారు. హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే విషయంలో తనకు కొంత సమాచారం ఉన్నప్పటికీ, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం గురించి తగిన సమాచారం ఇవ్వలేదని టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు.. కాసేపట్లో ఆయన మీడియాకు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారని సమాచారం.