Bigg Boss 5 Telugu : సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేసిన భామలు

బిగ్‌బాస్‌ సెట్ లో కంటెస్టెంట్లు ఎంజాయ్ వేస్తున్నారు. తాజాగా లోబో, సరయు, హమీదా స్మోకింగ్ జోన్ లో సిగరెట్ తాగుతూ హౌస్ విశేషాలు చెప్పుకున్నారు.

Bigg Boss 5 Telugu : సిగరెట్ తాగుతూ ఎంజాయ్ చేసిన భామలు

Bigg Boss 5 Telugu

Updated On : September 8, 2021 / 8:05 AM IST

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ లో అల్లరి మొదలైంది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం స్టార్ట్ చేశారు. మొత్తం 10 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు హౌస్ లో ఉన్నారు. కంటస్టెంట్లు వరసలు కలపడం స్టార్ట్ చేశారు. ప్రియాంక సింగ్ అందరినీ బ్రో అంటూ పలకరిస్తున్నారు.. ఒక మానస్ ను మాత్రం పేరుపెట్టి పిలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా హమీదా, సరయూ స్మోకింగ్‌ జోన్‌లో దర్శనమిచ్చారు.

లోబోతో కలిసి ఈ ఇద్దరు సిగరెట్ తాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ హౌస్ ముచ్చట్లు మాట్లాడుకున్నారు. హౌస్ సభ్యుల్లో కొందరు కనెక్ట్‌ కావడం కష్టమని, బయటే కనెక్ట్‌ అవుతామంటూ సంభాషించారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని లోబో బదులిచ్చాడు.

 

 

View this post on Instagram

 

A post shared by BiggBossTelugu5 (@bbtelugu5offl)