Mehaboob Dilse : సొంతిల్లు కట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. మీ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..

 బిగ్ బాస్ షో చాలా మందికి హెల్ప్ అవుతుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్లకి, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్లకి బిగ్ బాస్ షోలో ఎంటర్ అయితే వాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోతుంది.

Mehaboob Dilse : సొంతిల్లు కట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. మీ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..

Mehaboob

Updated On : October 25, 2021 / 3:27 PM IST

Mehaboob Dilse :  బిగ్ బాస్ షో చాలా మందికి హెల్ప్ అవుతుంది. కెరీర్ డల్ గా ఉన్న వాళ్లకి, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్లకి బిగ్ బాస్ షోలో ఎంటర్ అయితే వాళ్ల ఫాలోయింగ్ పెరిగిపోతుంది. వాళ్ళ కెరీర్ గాడిలో పడుతుంది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ఆఫర్స్ బానే వస్తాయి. వచ్చిన ఆఫర్స్ ని వాళ్ళు ఉపయోగించుకున్న దాని బట్టి వాళ్ల కెరీర్ మారుతుంది. చాల మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక స్టార్ సెల‌బ్రిటీలుగా మారి బాగానే సంపాదిస్తున్నారు. కార్లు కొనుక్కుంటున్నారు. ఇళ్ళు కట్టుకుంటున్నారు.

67th National Awards : నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న విజేత‌లు వీరే.. స్పెషల్ అట్రాక్షన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్

బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న యూట్యూబర్ మెహబూబ్ తక్కువ రోజుల్లోనే ఎలిమేనేట్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక మెహబూబ్ యూట్యూబ్ లో వీడియోలను తీస్తూ బిజీగా ఉన్నాడు. అంతే కాక ఈ మధ్య సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. తాజాగా మెహబూబ్‌ సొంత ఇళ్ళు కట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో షేర్ చేసి.. ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్‌ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టాడు. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Mehaboob Shaik (@mehaboobdilse)