67th National Awards : నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న విజేత‌లు వీరే.. స్పెషల్ అట్రాక్షన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఇవాళ ఉదయం ఢిల్లీలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగ

67th National Awards : నేష‌న‌ల్ అవార్డ్స్ అందుకున్న విజేత‌లు వీరే.. స్పెషల్ అట్రాక్షన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్

National Awards

67th National Awards :  67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్ర‌ధానోత్స‌వం ఇవాళ ఉదయం ఢిల్లీలో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయ‌న చేతుల మీదుగా అవార్డులను అందచేశారు. 2019వ సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు అత్యధిక ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు ఈ జాతీయ అవార్డులు అందజేశారు.

ఉత్తమ చిత్రంగా మలయాళం సినిమా ‘మరక్కర్’ నిలిచింది. ఉత్తమ నటుడుగా మనోజ్‌ బాజ్‌పాయీ ‘భోంస్లే’ సినిమాకు గాను, ధనుష్‌ ‘అసురన్‌’ సినిమాకు గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటిగా కంగనా రనౌత్‌ ‘మణికర్ణిక’ సినిమాకి అవార్డు అందుకుంది. ఉత్తమ దర్శకుడుగా సంజయ్‌ పూరన్‌ సింగ్‌ చౌహాన్‌ ‘బహత్తర్‌ హూరైన్‌’ హిందీ సినిమాకు ఈ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ ఎడిటింగ్‌ కు గాను నవీన్‌ నూలి ‘జెర్సీ’ సినిమాకి ఈ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ సినిమాకు ఆ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజులు ఈ అవార్డుని అందుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ సినిమాకు అవార్డు అందుకుంది. ఉత్తమ సహాయ నటుడుగా విజయ్‌ సేతుపతి ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రఫీ అవార్డుని కన్నడ సినిమా ‘అవనే శ్రీమన్నారాయణ’ అందుకుంది. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్‌కి గాను ‘మరక్కర్‌’ సినిమా అవార్డు అందుకుంది. ఉత్తమ సంగీత దర్శకుడు పాటల విభాగంలో డి.ఇమ్మాన్‌ తమిళ్ సినిమా ‘విశ్వాసం’కి అవార్డు అందుకున్నాడు. ఉత్తమ సంగీత దర్శకుడు నేపథ్య విభాగంలో ప్రబుద్ధ బెనర్జీ ‘జ్యేష్టపుత్రో’ సినిమాకి అవార్డు అందుకున్నారు. ఉత్తమ మేకప్‌ మలయాళం సినిమా ‘హెలెన్’కి గాను రంజిత్‌ అందుకున్నారు. ఉత్తమ గాయకుడుగా బ్రి.ప్రాక్‌ ‘కేసరి’ చిత్రంలోని ‘తేరీ మిట్టీ’ పాటకి అవార్డు తీసుకున్నారు. ఉత్తమ గాయనిగా శావని రవీంద్ర మరాఠి సినిమా ‘బర్దో’కి అవార్డు అందుకుంది. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా మహర్షి సినిమాకి రాజు సుందరంకి అవార్డు వరించింది.

Chiranjeevi – Pawan Kalyan : రిసెప్షన్ వేడుకలో అన్నయ్యని పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఇక తెలుగు ఉత్తమ చిత్రంగా ‘జెర్సీ’ నిలువగా ఆ అవార్డును ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత నాగ వంశీ అందుకున్నారు. ఉత్తమ తమిళ చిత్రంగా ‘అసురన్‌’ నిలవగా ఆ అవార్డును సినిమా డైరెక్టర్ వెట్రిమారన్ మరియు నిర్మాత అందుకున్నారు.

Mahathi Swara Sagar : సింపుల్ గా మణిశర్మ తనయుడి వివాహం

ఈ వేడుకతో పాటు ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా ప్రకటించారు. ఈ అవార్డు సూపర్ స్టార్ రజినీకాంత్ ని వరించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డును రజినీకాంత్ కి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందించారు. దీంతో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.