Mahathi Swara Sagar : సింపుల్ గా మణిశర్మ తనయుడి వివాహం

నిన్న ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహతి స్వర సాగర్ వివాహం నిరాడంబరంగా జ‌రిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది.

Mahathi Swara Sagar : సింపుల్ గా మణిశర్మ తనయుడి వివాహం

Mahathi

Updated On : October 25, 2021 / 2:12 PM IST

Mahathi Swara Sagar :  మెలోడీ బ్రహ్మ సంగీత దర్శకుడు మణిశర్మ తనయుడు యువ సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. `ఛలో`, `భీష్మ`, `మాస్ట్రో` లాంటి సూపర్ హిట్ చిత్రాలకు సరికొత్త సంగీతం అందించి యువ సంగత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ యువ దర్శకుడు ఇప్పుడు ఓ ఇంటివాడు అయ్యాడు. ఇటీవల మహతి స్వర సాగర్ కి తమిళ్, తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో గాయనిగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న సంజన కలమంజతో నిశ్చితార్ధం జరిగింది. ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.

UnStoppable NBK: షోలో సందడి చేయాలా..! దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..!

తాజాగా నిన్న ఆదివారం రోజు చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహతి స్వర సాగర్ వివాహం నిరాడంబరంగా జ‌రిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహానికి అతి కొద్ది మందిని మాత్రమే పిలిచినట్టు సమాచారం. తెలుగు, తమిళ పరిశ్రమ నుంచి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ప‌లు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. సంజన గతంలో మహతి దర్శకత్వంలో కొన్ని పాటలు పాడింది.